Mirabilis Jalapa Uses : చంద్రకాంత మొక్క… దీని పూలు చాలా అందంగా కనిపిస్తాయి. దీని శాస్త్రీయనామం మిరాబిలిస్ జలపా (Mirabilis Jalapa).. ఈ పూలు అనేక రంగుల్లో ఉంటాయి. దీనిని నాలుగు గంటల పువ్వు అనీ పిలుస్తుంటారు. ఎందుకంటే ఇది కామన్ గా సాయంత్రం 4 గంటలకు వికసిస్తుంది. డే టైంలో ముడుచుకుని ఉంటుంది. దీని నుంచి వచ్చే పరిమళం చాలా బాగుంటుంది. ఇది చాలా సున్నితమైనది కూడా. ఎండ తగిలితే దీని పూలు వెంటనే వాడిపోతాయి. ఇందులోని గింజలు రుద్రాక్షల మాదిరిగా ఉండటం వల్ల ఈ పూలను రుద్రాక్ష పువ్వులు అనీ అంటారు. ఈ మొక్కలో పువ్వులు మినహా మిగతా భాగాల్లో ఔషధ గుణాలుంటాయి. ఆకులు, వేర్లు, దుంపులతో మంచి ఫలితాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతున్నది.
మచ్చలు, తామర, మొటిమలు నివారించేందుకు ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి కట్టులాగా కడితే అవి ఇట్టే నయమైపోతాయి. ఈ పువ్వులను ఆహరంలో వాడే రంగుల్లో ఎక్కువగా వినియోగిస్తారు. కేకులపైనా రంగుల కోసం వీటిని వాడుతుంటారు. మూత్ర విసర్జన, శుద్ధీకరణ, గాయాలు మానేలా చేయడంలో దీనిని వినియోగిస్తారు. ఈ మొక్కతో కషాయాన్ని తయారు చేస్తుంటారు. ఇది అనేక వ్యాధులకు నివారణిగా ఉపయోగపడుతుంది.
తేలు, తేనెటీగలు కుట్టిన టైంలో ఈ ఆకుల రస్తాన్ని ఆ చోట రాస్తే నొప్పి, మంట నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఈ మొక్క విత్తనాల నుంచి తీసిన ప్రొటీన్ పదార్థాలు క్యాన్సర్ ను నివారించడంలో, సూక్ష్మజీవులను నాశనం చేయడంలో పనిచేయస్తాయని ఇటీవలే జరిపిన పరిశోధనల్లో తేలింది. దీనిని చైనా వారు యాంటిడిప్రెసెంట్, మలేరియల్‌గా వినియోగిస్తారు. దురద కలిగిన చోటు ఈ మొక్క ఆకులను పేస్టులా చేసి రాస్తే రిలీఫ్ కలుగుతుంది.
Read Also : Prosopis Juliflora Benefits : పేరుకే పిచ్చి మొక్క.. దాని ప్రయోజనాలు తెలిస్తే షాకవ్వాల్సిందే…!