Ringworm Home Remedy : మనలో చాలా మందికి చెప్పుకోలేని చోట దురద, గజ్జి, తామర వస్తుంది. దీంతో వారు పడే బాధ మామూలుగా ఉండదు. ఎప్పుడు దురద పెడుతూనే ఉంటుంది. దీంతో చాలా మందిలో ఉండగా వారు దానిని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమనే చెప్పాలి. ఇక ఆఫీస్‌లో ఉన్న వారి విషయం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అటు కంట్రోల్ చేసుకోలేక.. ఇటు ఇబ్బంది తాళలేక వారు పడే నరయాతన మామూలుగా ఉండదు. ఓ వైపు దుస్తులు తాకుతూ మంటను కలిగిస్తాయి.
ఇలాంటి టైంలో దురద కలిగిన ప్రదేశాన్ని గోకితే మరింత ప్రమాదమే. దీనిని నివారించేందుకు చాలా రకాల క్రీమ్స్ వాడుతుంటారు. వాడినప్పుడే అదే కొంచెం ప్రభావం చూపినా భవిష్యత్తులో ఆ సమస్య మళ్లీ తిరిగి వచ్చే అవకాశముంది. అయితే రెమిడీతో దానిని దూరం చేయొచ్చు. భవిష్యత్తులో అది తిరిగి రాకుండా చేయొచ్చు. అది ఎలాగో చూద్దామా మరి..

ముందుగా ఒక గిన్నెలోకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ తీసుకోని దానిలో కొన్ని వేప ఆకులు వేయాలి. నీటి రంగు మారేదాక ఆ నీటిని మరిగిస్తూనే ఉండాలి. తర్వాత మంటను ఆఫ్ చేసి దాన్ని వేరె గిన్నెలోకి తీసుకోండి. తర్వాత అందులో మరో గిన్నెలో కొబ్బరి నూనెను తీసుకుని దానిలో ఒకటి లేదా రెండు కర్పూరం బిళ్లలను వేసి మిక్స్ చేయాలి.
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దానిని పక్కన పెట్టుకోవాలి. దురద, తామర, గజ్జి వంటి సమస్యలు ఉన్న చోట ముందుగా రెడీ చేసుకున్న వేప నీటితో దానిని శుభ్రం చేయాలి. తర్వాత కొబ్బరినూనె, కర్పూరంతో చేసిన మిక్చర్‌ను రుద్దాలి. పడుకునేటప్పుడు ఇలా రుద్ది.. రాత్రంగా అలాగే ఉంచాలి. ఇలా ఒక వారం పాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక ఇలాంటి వ్యాధులు మళ్లీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇబ్బంది ఎక్కువగా ఉంటే డాక్టర్లను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించడం ఉత్తమం.
Read Also : Ayurveda Mulikalu : ఈ ఆయుర్వేద మూలికలు వాడండి.. గుండె ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడతాయి!