Rice For Weight Loss : నేటి సమాజంలో బరువు పెరుగుతున్నామని బాధపడే చాలా మంది నిపుణుల సూచన మేరకు డైట్ మెయింటెన్ చేస్తుంటారు. అందుకోసం ఒక పూట మాత్రమే అన్నం తీసుకుంటూ.. రాత్రి పూట గ్లాస్ పాలు లేదా చపాతి తిని పడుకుంటారు. ఇలా చేస్తే బరువు తగ్గొచ్చని అనుకుంటారు. అయితే, ఇలా చేయడం వలన బరువు తగ్గరు. అలా అని అన్నం తరచూ తినడం వలన కూడా బరువు పెరగరని న్యూట్రీషనిస్టులు చెబుతున్నారు. టైం కానీ టైంలో తినడం, బయట దొరికే జంక్ ఫుడ్, లేదా కొవ్వు పదార్థల వస్తువులు ఎక్కువగా తీసుకోవడం వలన బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.
రైస్ తినడం కలిగే లాభాలు : శరీరానికి తగినంత శక్తి చేకూరాలి అంటే అన్నం మాత్రమే మంచి సొల్యూషన్ అంట. రైస్‌కు బదులు వేరే ఆహార పదార్థాలు తీసుకుంటే బాడీలో కొవ్వు పదార్థాలు పేరుకుపోతాయి. దీంతో అధిక బరువు, ఒబెసిటీ వంటి దుష్పలితాలు కలుగుతాయి. అయితే, డబుల్ పాలిష్డ్ రైస్ తినడం కంటే సింగిల్ పాలిష్డ్ రైస్ తినడం వలన ఎంతో ఆరోగ్యం కలుగుతుంది. బ్లడ్‌లో ఉండే షుగర్ లెవర్స్ కూడా నార్మల్ లెవల్‌లో ఉంటాయి. దీనితో పాటు మొలకలు, పెరుగు రైస్‌లో యాడ్ చేసుకుని తినడం వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
త్వరగా జీర్ణం అవుతుంది : కొందరు ఆహారం తీసుకున్నాక జీర్ణసమస్యతో బాధపడుతుంటారు.అలాంటి వారు రైస్ తీసుకోవడమే బెటర్ అంట.. త్వరగా జీర్ణం అవుతుంది. మంచి నిద్రతో పాటు చర్మం కాంతివంతంగా మారుతుంది. హార్మోన్స్ లెవెల్స్ హెచ్చుతగ్గులు కాకుండా నివారిస్తుంది. జీర్ణసమస్యతో బాధపడేవారు బియ్యంలో జీలకర్ర వేసుకుని కొద్దిగా మెత్తగా ఉడికించి తింటే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గి జీర్ణసమస్య తగ్గుతుంది.
రైస్‌లో చాలా ప్రోటీన్స్, మినరల్స్ ఉంటాయి. వీటిద్వారా హెయిర్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. థైరాయిడ్ వంటి సమస్యలు రాకుండా కంట్రోల్ చేస్తుంది. రైస్ తినడం వలన మంచి శరీరాకృతి కలుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. అంతేకానీ, అన్నం తినడం వలన బరువు పెరగడం గానీ తగ్గడం కానీ జరుగదు. కేవలం సమయానుకనుగుణంగా తినకపోవడం, జంక్ ఫుడ్ వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి.
Read Also : Rice or Roti: రాత్రిపూట అన్నం తింటే మంచిదా? చపాతి మంచిదా? నిపుణులు ఏమంటున్నారు?