MeArogyam Health News Telugu - MeArogyam.com
  • Home
  • అందం-ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఫిట్‌నెస్
  • ఆరోగ్య చిట్కాలు
  • రిలేషన్ షిప్
  • ఆధ్యాత్మికం
  • వంటకాలు
MeArogyam Health News Telugu - MeArogyam.com
Home Health Tips

Rice or Roti: రాత్రిపూట అన్నం తింటే మంచిదా? చపాతి మంచిదా? నిపుణులు ఏమంటున్నారు?

mearogyam by mearogyam
December 13, 2021

Rice or Roti : సాధారణంగా జనం తీసుకునే ఆహారపదార్థాలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మధ్య మారుతుంటాయి. అలా మారడాన్ని మనం గమనించొచ్చు. అయితే, అందరు తినే ఆహారం అన్నం అని చెప్పొచ్చు. మన దేశంలో అయితే అన్నం అందరు తింటుంటారు. అయితే, ఉత్తర భారతదేశ ప్రజలు అన్నంకు బదులుగా ఇతర ఆహార పదార్థాలు తీసుకుంటుంటారు.

దక్షిణ భారతదేశ ప్రజలు మాత్రం అన్నం కంపల్సరీ అన్న రీతిలో దానిని తమ ఆహారంలో భాగం చేసుసుకుంటుంటారు. అయితే, ఇటీవల కాలంలో చాలా మంది అన్నంకు బదులుగా చపాతీలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రాత్రిపూట అన్నం తింటే మంచిదా? చపాతి తింటే మంచిదా? నిపుణులు ఏమంటున్నారు.. అనే విషయాలు ఈ స్టోరి చదివి తెలుసుకుందాం.

chapati diet for quick weight loss

చద్ది అన్నంతో ఒంటికి మేలు :
అన్నంతో పాటు చపాతి హెల్దీ డైట్‌లో భాగమని చాలా మంది చెప్తుండటం మనం చూడొచ్చు. వరి పంట ద్వారా వచ్చిన బియ్యం నుంచి అన్నం వండుకుంటామన్న సంగతి అందరికీ విదితమే. అయితే, ఈ అన్నంలో కంటే కూడా గోధుమ పిండితో చేసిన చపాతీల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అన్నంతో పోల్చితే ఐదు రెట్లు ఎక్కువగా ప్రోటీన్స్ గోధుమ చపాతీల్లో ఉంటాయి. ఇకపోతే గోధుమలో ఉండే కార్బోహైడ్రేట్స్, పొటాషియం హెల్త్‌కు చాలా అవసరమైనవి. దాంతో పాటు గోధుమల్లో ఉండే గ్లైసిమిక్ ఇండెక్స్ అన్నం కంటే ఎక్కువగా ఉంటుంది.

chapati diet for quick weight loss
chapati diet for quick weight loss

బ్లడ్‌లో గ్లూకోజ్‌ పెరగకుండా చూస్తుంది ఇది. ఇకపోతే అన్నం, గోధుమ పిండి రెండిటిలో ఫైబర్ ఉన్నప్పటికీ అన్నంతో పోలిస్తే గోధుమ ఆరు రెట్లు ఎక్కువ ఫైబర్ ఉంటుంది. తద్వారా మీరు గోధుమ పిండితో చేసిన చపాతీలు తింటే చాలా సేపు వరకు మీకు అసలు ఆకలి కాదు. ఎందుకంటే అన్నంలో లభించే కార్బోహైడ్రేట్స్ వంటివి మాత్రం తొందరగా రక్తంలో కలిసిపోతాయి. ఫలితంగా తర్వాత మీకు ఆకలి ఎక్కువగా వేస్తుంటుంది.

నూనె లేని చపాతీలే ఆరోగ్యం :
ఇకపోతే గోధుమలో ఉండే ఫైబర్ వల్ల డైజేషన్ స్లోగా అవుతుంది. ఇటీవల కాలంలో చాలా మంది వెయిట్ లాస్ అవడం కోసం నైట్ టైం ఫుడ్‌లో చపాతీలను భాగం చేసుకోవడం మనం చూడొచ్చు. అయితే, ఈ చపాతీలు తినేవాళ్లు వీటిని అతి తక్కువ నూనెతో కాల్చుకోవాలని గుర్తించుకోవాలి. కుదిరితే చపాతీలను నూనె లేకుండానే కాల్చుకుని తింటే మంచిది. ఇకపోతే ఫుల్ ప్లేట్ మీల్స్ చేసినా రెండు లేదా మూడు చపాతీలు తిన్నా లభించే శక్తి ఒక్కటేనని, ఈ క్రమంలో అన్నం కంటే చపాతి శరీరానికి చాలా శక్తినిస్తుందని పరిశీలనలో తేలినట్లు డాక్టర్స్ పేర్కొంటున్నారు.

ఇక గోధుమలో ఉండే విటమిన్స్ ఈ, బి, ఖనిజాలు కాపర్, మాంగనీస్, సిలికాన్, మెగ్నీషియం, కాల్షియం, అయోడిన్ హెల్త్‌కు చాలా మంచివి. గోధుమల్లో ఉండే ఐరన్ వల్ల మీ బ్లడ్‌లో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా ఇట్టే పెరుగుతుంది. ఇకపోతే పని ఒత్తిడిలో పడి చాలా మంది టైమ్‌కు భోజనం తీసుకోరు. ఈ క్రమంలోనే నైట్ ఎప్పుడో ఇంటికి రీచ్ అవుతుంటారు. అప్పటికే అర్ధరాత్రి అయి ఉంటుంది. అయినా వారు అలానే అర్ధరాత్రి పూట భోజనం తీసుకుంటారు. భోజనం చేసిన తర్వాత వెంటనే నిద్రకు ఉపక్రమిస్తారు. తద్వారా అనారోగ్యం పాలయ్యే ప్రమాదముంది.  

రాత్రి తిన్న వెంటనే నిద్రపోతే :
అన్నం తిన్న వెంటనే పడుకోకూడదు. ఇక ఎలాగూ టైం దాటిపోయిందనే ధ్యాసలో పడుకుంటారు. కానీ అలా చేయొద్దు. ముఖ్యంగా అన్నం టై దాటిపోయినపుడు ఎక్కువ మొత్తంలో తీసుకోకపోవడమే మంచిది. భోజనానికి, నిద్ర పోవడానికి మధ్య కనీసంగా అరగంట లేదా గంట గ్యాప్ ఉండేలా చూసుకోవడం చాలా మంచిది.

chapati diet for quick weight loss
chapati diet for quick weight loss

ఇకపోతే చపాతీలు ఎలాగూ ఆరోగ్యానికి మంచివి కదా అని చెప్పి ఎక్కువ మొత్తంలో తీసుకున్నా ప్రమాదమే. మోతాదుకు మించి తీసుకోకూడదు. అన్నం కంటే చపాతీ ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది కాబట్టి నైట్ టైంలోనే కాకుండా డే టైంలో మార్నింగ్ లేదా ఆఫ్టర్‌నూన్ టైంలో తీసుకున్నా మంచి ప్రయోజనాలే ఉంటాయి. గోధుమ పిండిలో ఉండే ఐరన్ వల్ల హార్ట్ హెల్త్‌కు మంచి జరుగుతుంది. కాబట్టి గోధుమ పిండితో చేసిన చపాతీలను లిమిట్‌లో తీసుకుంటే బాగుంటుంది.

రాత్రిపూట చపాతీలు తినొచ్చా? :
అయితే, చపాతీలను నైట్ టైంలో తీసుకోవడం కూడా మంచిదే కానీ ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల లోపు మాత్రమే చపాతీలను తింటే మంచిదని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, మరి కొందరు నిపుణులు రాత్రి పూట 7 గంటల ముందరే అనగా ఈవినింగ్ టైంలోనే 6 గంటలకో లేదా 5.30 గంటలకో చపాతీలు తీసుకంటే మంచిదని చెప్తున్నారు. అలా తీసుకోవడం వల్ల డైజెషన్ అయ్యే చాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నది వారి వాదన. ఇకపోతే రాత్రి పది గంటల తర్వాత టైంలో చపాతీలు తింటే డైజెషన్ ప్రాబ్లమ్ అవుతుంది.

రాత్రి పూట కొంచెం లిమిట్‌లో చపాతీలు తీసుకోవచ్చు. కానీ, ఉదయం వేళల్లో అయితే ఎంత ఎక్కువ చపాతీలు తీసుకున్నా ఎటువంటి సమస్యలు ఉండబోవు. డైజెషన్‌కు డే లాంగ్ టైం ఉంటుంది కాబట్టి చపాతీలు ఈజీగా డైజెస్ట్ అవుతాయని చెప్తున్నారు. మొత్తంగా చాలా మంది జనం గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలను చాలా మందే రాత్రి పూట అన్నంకు బదులుగా తీసుకుంటున్నారు.

Tags: chapati diet for quick weight lossis brown rice better than chapati for weight lossis chapati good for weight lossIs it okay to eat rice at night for weight loss?Is rice or roti better for weight loss at night?rice or chapati which is better for weight gainrice vs roti caloriesrice vs roti for bodybuildingRice vs roti for weight loss
Previous Post

Teeth Whitening Tips : దంతాలు తెల్లగా మిళమిళ మెరిసిపోవాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవండి..

Next Post

Instant Breakfast Recipes : 5 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్ ఫాస్ట్‌ల గురించి మీకు తెలుసా?

Related Posts

Anjeer Health Benefits in telugu
Health Tips

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

7 Amazing Things that Happen if You Eat MANGOES in Telugu
Health Tips

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

Atibala-plant-Atibala-plant-benefits in telugu
Ayurvedam

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

aloo garlic curry in telugu
Food Recipes

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

Sky Fruit health Benefits in Telugu
Health Tips

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

Graha Dosha Nivarana Remedies in telugu
Latest

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

Leave Comment

TODAY TOP NEWS

  • Latest
Anjeer Health Benefits in telugu

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

by mearogyam

7 Amazing Things that Happen if You Eat MANGOES in Telugu

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

by mearogyam

Atibala-plant-Atibala-plant-benefits in telugu

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

by mearogyam

aloo garlic curry in telugu

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

by mearogyam

Sky Fruit health Benefits in Telugu

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

by mearogyam

Graha Dosha Nivarana Remedies in telugu

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

by mearogyam

Sunday Surya Mantras Remedies in Telugu

Surya Bhagavan : ఆదివారమున ఇలా చేసి ఈ మంత్రాన్ని జపిస్తే జాతకంలో రవి బలం పెరిగి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మెరుగుపడతారు…

by mearogyam

.Mithuna Rasi Phalalu November Month Horoscope 2024 in telugu

Horoscope 2024 : మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది?

by mearogyam

Guru Dattatreya

Guru Dattatreya : గురువారం దత్తాత్రేయున్ని, అనగాదేవి ని ఇలా అర్చన చేస్తే గురుగ్రహదోషం ,గతజన్మ పాపాల దోషాలు తొలగుతాయి….

by mearogyam

  • Home
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy

© 2023 Mearogyam - All Rights Reserved - Mearogyam News

No Result
View All Result
  • Home
  • అందం-ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఫిట్‌నెస్
  • ఆరోగ్య చిట్కాలు
  • రిలేషన్ షిప్
  • ఆధ్యాత్మికం
  • వంటకాలు

© 2023 Mearogyam - All Rights Reserved - Mearogyam News