Reverse Diabetes Diet : షుగర్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే మీకోసం అద్భుతమైన డైట్ ఒకటి అందుబాటులో ఉంది. అందరికి తెలిసిన డైట్… కానీ, చాలామంది ఈ డైట్ విషయంలో పెద్దగా ఆసక్తి చూపించరు. ఎవరైతే క్రమం తప్పకుండా ఇలాంటి డైట్ పాటిస్తారో వారి బ్లడ్ షుగర్ లెవల్స్ పూర్తిగా తగ్గించుకోవచ్చు.
ఇంతకీ ఆ అద్భుతమైన డైట్ ఏంటంటే.. చిరు ధాన్యాల గురించి అందరికి తెలిసే ఉంటుంది. అందులో షుగర్ పేషంట్లకు బాగా సుపరిచితమైనది.. సిరి ధాన్యాలు అనగానే అందరికి గుర్తుచ్చేది జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, అండు కొర్రలు, సామెలు, ఊదలు, అరికెలు ఇలా చాలానే ఉన్నాయి. వాస్తవానికి పాత రోజుల్లో మన పెద్దవాళ్లు ఎక్కువగా ఈ ధాన్యాలనే తినేవారు.
అప్పటి ముసలివాళ్లకు ఎలాంటి రోగాలు దరిచేరేవి కావు. అందులోనూ షుగర్ సమస్య అసలే ఉండదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అందరూ ఎక్కువగా తెల్ల బియ్యానికి బాగా అలవాటు పడిపోయారు. బియ్యంతో చేసిన పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నారు.
తద్వారా రక్తంలో కార్భోహైడ్రేట్స్ వంటి పిండి పదార్థాలు చేరడం ద్వారా షుగర్ కంట్రోల్ తప్పుతుంది. ప్రతిరోజూ పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా రోజురోజుకీ బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ తప్పి తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. అందుకే షుగర్ పూర్తిగా కంట్రోల్ కావాలంటే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా తమ ఆహారంలో సిరి ధాన్యాలను తప్పక చేర్చుకోవాలి.

Reverse Diabetes Diet : బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయాలంటే..!
బియ్యంతో వండిన ఆహారాన్ని పూర్తిగా మానేయండి. వైట్ రైస్ కు బదులుగా జొన్నలు, రాగులు వంటి తృణధాన్యాలను రొట్టె రూపంలో చేసుకుని తినండి. లేదంటే.. జావలాగా కూడా చేసుకుని తాగేయొచ్చు. దెబ్బకు షుగర్ కంట్రోల్ అవుతుంది. ప్రతిరోజూ 2 పూటలా ఇదే ఆహారాలను తీసుకోవాలి. షుగర్ దానంతట అదే అదుపులోకి వస్తుంది. ఎందుకంటే.. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
అందుకే షుగర్ వెంటనే కంట్రోల్ అవుతుంది. బార్లీ, ఓట్స్ తృణ ధాన్యాలను కూడా రోజువారీ ఆహారంలో తీసుకుంటుండాలి. ప్రతిరోజూ 2 పూటలా చిరు ధాన్యాలు, ఒక పూట తృణ ధాన్యాలను తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగానీ చేస్తే షుగర్ చాలా తొందరగా కంట్రోల్లోకి వస్తుంది. ఓట్స్‌ను ఉప్మా లాగా తినవచ్చు. షుగర్ కంట్రోల్ లో పెట్టుకుంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం సుఖంగా గడపవచ్చు.