Remove Warts on face : తమలపాకుని సంస్కృతంలో నాగవల్లి అని పిలుస్తారు. పైపర్ బీటెక్ అనే లాటిన్ పేరు దీనికి ఉంది. తమలపాకులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. హనుమంతుని పూజలో తమలపాకు పూజ చాలా ప్రత్యేకమైనది. ఆ తమలపాకుతో పూజ చేయడం వల్ల హనుమంతుడు మంచి కోరికలు తీరుస్తాడని విశ్వసిస్తారు. ఇలాంటి తమలపాకు గురించి ఆరోగ్యకర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఎవరికైతే నోటి దుర్వాసన ఉంటుందో వాళ్లు తమలపాకు తాంబూలంగా తీసుకుంటే తొందరగా నోటి దుర్వాసన పొగొట్టుకోవచ్చు.
చాలామంది భోజనం తర్వాత కిల్లిలా లేదా తాంబూలం వేసుకుంటారు. చాలామంది భోజనం తర్వాత తమలపాకులు వేసుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. ఇలా చేయడం ద్వారా జటరాగ్ని బాగా వృద్ధి అయి మంచి శక్తినిస్తుంది. తమలపాకు తాంబూలాన్ని ఎలా తీసుకోవాలి. తలపాకులు ఎప్పుడైనా సరే తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చివర ఆకులు తొలగించాలి. అలా తీసేసిన తర్వాత శుభ్రంగా మంచిదైనటువంటి సున్నాని జాయిగా రాయాలి. చాలా పలచగా రాయాలి. ఆ తర్వాత అందులో పోక చెక్క కొద్దిగా వేసుకుని మంచి పచ్చ కర్పూరం కొద్దిగా వేసుకుని జాజికాయ లవంగము, యాలకులు లాంటివి అందులో వేసుకోవాలి. చిలకలాగ చుట్టుకుని భోజనం తర్వాత తీసుకున్నట్లయితే నోటు దుర్వాసన అసలే ఉండదు.
Remove Warts : ముఖంపై పులిపిర్లు రాలిపోవాలంటే ఇలా చేయండి..
తమలపాకుని తేలు కుట్టినప్పుడు కూడా కూడా వాడుకోవచ్చు. తేలు కుట్టినప్పుడు తమలపాక లేపనం చేసి ఒక చెంచాడు లోపలి రసాన్ని తీసుకుంటే తేలు కుట్టిన బాధ తక్కువ నిమిషాల్లోనే తగ్గుతుంది. తమలపాకుతో ఒంటి మీద పులిపిరి కాయలను కూడా ఈజీగా తగ్గించుకోవచ్చు. చాలా అద్భుతమైన రెమడీ.. తమలపాకు చివర్లను శుభ్రంగా నూరుకుని అందులో కొద్దిగా సున్నం వేసి బాగా నూరుకోవాలి. ఆ చూర్ణాన్ని ఎక్కడైతే పులిపిర్లు ఉన్నాయో ఆ ప్రాంతంలో మందులా పెట్టినట్లయితే కొన్ని రోజుల్లోనే పులిపిర్లు అన్ని రాలిపోతాయి. పులిపిర్లు తగ్గించే అద్భుతమైన గుణం తమలపాకులో ఉంది.

అంతేకాకుండా, తమలపాకుని ఇంకా అనేక విషయాల్లో వాడుకోవచ్చు. కంటికి సంబంధించిన కండ్ల కలకలో తమలపాకులు వాడుకోవచ్చు. ఒక చుక్క తమలపాకు రసాన్ని కళ్లలో వేసినట్లయితే.. కంటిలోని మలినాలన్నీ తొలగిపోతాయి. శ్వాస ఆడకపోతే కూడా తమలపాకులు వాడుకోవచ్చు తమలపాకు పైన కొద్దిగా తేనె రాసి ఇందులో కొద్దిగా పిప్పల చూర్ణం గాని లేదా మిరియాల చూర్ణం గానీ లేదా యాలకులు గానీ ఈ మూడింటిలో ఏదో ఒకదానివేసుకుని బుగ్గన పెట్టుకుని జాయిగా నములుతుంటే శ్వాసకోశ సమస్యలు, దగ్గు, ఆయాసం లాంటివి కచ్చితంగా తగ్గుతాయి.
Read Also : Warts Remove Tips : ‘పులిపిర్లు’ మీ అందాన్ని చెడగొడ్తున్నాయా..? ఇలా చేస్తే వాటంతటవే రాలిపోతాయి..!