Pomelo Fruit : ప్రకృతి మనకు ఇచ్చిన వరం మొక్కలు.. ఇవి మనకు ఎంతో మంచి చేస్తాయి. మొక్కల నుంచి ఔషధాలే కాకుండా వీటి నుంచి లభించే పండ్లు మనకు ఆహారంగా పనికొస్తాయి. మంచి ఆరోగ్యానిస్తాయి. అందుకు సీజనల్ వారిగా లభించే పండ్లను తప్పకుండా తినాలని వైద్యులు చెబుతున్నారు. అయితే, చాలా మందికి పంపర పనస గురించి తెలియక పోవచ్చు. పనస పండులాగా భారీగా ఉండి లోపల మాత్రం నిమ్మకాయను పోలి ఉంటుంది. నిమ్మజాతికి ఈ చెట్టు పండులో విటమిన్ ‘సీ’అధికంగా ఉంటుంది.
షుగర్ వ్యాధి గ్రస్తులకు ఇది దివ్య ఔషధమనే చెప్పాలి. ఉష్ణమండల ప్రాంతాల్లో ఇది ఎక్కువగా పండుతుంది. దీని రుచి పులుపు, వగరు, తీపి కలయికలతో ఉంటుంది. పంపర పనసలో ఔషధాలు మెండుగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనిని తినడం వలన జీర్ణ వ్యవస్థను శుద్ధి చేస్తుంది. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన కణాలకు నిరోధకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా బోలు ఎముకల వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుంది.ఈ సమస్య అధికంగా మహిళలను వేధిస్తుంది.

అలాంటి వారికి ఈ పండు చాలా మేలు చేస్తుంది. బరువు తగ్గటానికి, కాలేయ సమస్యలను నివారిస్తుంది. అదే విధంగా రక్త ప్రసరణలో ఆటంకం లేకుండా చూస్తుంది. గుండె పోటు వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ పండు తింటే చర్మం కూడా ఆరోగ్యవంతంగా మెరుస్తుంది.వృద్ధాప్య లక్షణాలు దూరం అవుతాయి. ఈ పండు తింటే 30 ఏజ్ దాటిన మహిళల ఎముకల్లో కాల్షియం కొరవడకుండా చూస్తుంది. ఫలితంగా వారు ధృడంగా మారుతాయి.
Read Also : Headaches in Children : పిల్లల్లో వచ్చే తలనొప్పిని లైట్ తీసుకుంటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసుకోండి