Pampara Panasa Benefits : పంపర పనసకాయ గురించి ఎప్పుడైనా విన్నారా? పంపర పనసకాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుసా? నిమ్మ జాతిలో చాలా రకాలు చూస్తుంటాం. నారింజ, నిమ్మ జాతులన్నీ కూడా ఇంచుమించుగా చూడడానికి ఒకేలాగా ఉంటాయి. డబ్బా పంపర పనసకాయ కూడా ఇంచుమించుగా నిమ్మ జాతి మొక్కల మాదిరిగానే ఉంటుంది. ఈ పనస జాతి చెట్టును బృహత్ జంబీర అనే పేరుతో పిలుస్తారు. తెల్లటి పెద్ద పువ్వులు, పెద్దదైన కాయలా దబ్బకాయ కన్నా ఇంకా పెద్దగా ఉంది.
తొనలు అన్నీ కూడా దాదాపుగా నారింజకాయ మాదిరిగా ఉంటాయి. రెగ్యులర్‌గా బత్తాయి, నారింజ తింటూ ఉంటారు. తొక్క చాలా దళసరిగా ఉంటుంది. అందులోని తొక్క వగరు చేదు రుచులు కలిగి ఉంటుంది. అలాగే, పంపర పనసకాయలు ఉండే మొక్క అద్భుత ఔషధ గుణాల గురించి మనం తెలుసుకుందాం. దబ్బకాయ పచ్చడిని బెల్లంతో కలిపి నిల్వ పచ్చడి పెట్టుకోవడం అందిరికి తెలిసిందే.

ఆయుర్వేదంలో పంపర పనస కాయను ప్రత్యేకంగా ఎలా వాడతారు.. దాహం వేస్తున్నప్పుడు ఆకలి సరిగ్గా లేనటువంటి టైంలోనూ వాంతి, వికారం లాంటి పరిస్థితుల్లోనూ సాధారణంగా నిమ్మ జాతులు వాడుతున్నాం. పంపర పనస రసాన్ని తోనలు తీసుకుని శుభ్రంగా మిక్సీ చేసి జ్యూస్ చేసుకోవాలి. అందులో కొద్దిగా పంచదార కలుపుకొని తాగితే అత్యధిక దాహం వెంటనే తగ్గుతుంది. చాలామందికి గర్భిణీ స్త్రీలలోనూ కొంతమంది ఎప్పుడు వాంతులు అవుతుంటాయి.
Pampara Panasa Benefits : పంపర పనసకాయలో పోషక విలువలు ఇవే..
ఈ పంపర పనస రసాన్ని తాగడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంట్లో లేకపోతే మన పెరట్లో కూడా ఈ నిమ్మ జాతి పంపర పనసకాయలను పెంచుకోవచ్చు. పంపర పనాసకాయలో ఉండే రసాన్ని చెంచాడు తీసుకుని అర స్పూన్ పంచదార కలిపి తాగితే ఎలాంటి వాంతులు అయిన సరే వెంటనే తగ్గిపోతాయి. చర్మవ్యాధితో బాధపడుతున్నవారు ఈ పంపర పనసకాయ తొక్కలు కూడా ఉపయోగమే. పంపర పనసకాయ తొక్కలు పక్కనపెట్టి బాగా ఎండిన తర్వాత చూర్ణంగా చేసుకుని కొబ్బరి నూనెలో కలుపుకోవాలి. చర్మ సమస్య దగ్గర అప్లై చేస్తే బాగా మంట పుడుతుంది. తద్వారా చర్మ వ్యాధి తొందరగా తగ్గుతుంది.
పొమె (పంపర పనస) పండు పెద్ద పరిమాణంలో తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. ప్రోటీన్, ఫైబర్‌లను కలిగి ఉంటుంది. దాంతో ఈ పండును తీసుకోవడం ద్వారా ఎక్కువ సమయం కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. పోమెలోస్‌లో విటమిన్ సి, నరింగెనిన్, నారింగిన్, లైకోపీన్ వంటి అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పోమెలో 6 గ్రాముల ఫైబర్ కలిగి ఉంటుంది. ఫైబర్ ఉండటం కారణంగా మలాన్ని ఎక్కువ తయారు చేయడంలో సాయపడుతుంది. ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను పెరిగేలా చేస్తుంది. తద్వారా ప్రేగుల్లో కదిలికలు ఏర్పడి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి.
Read Also : Ranapala Helath Benefits : రణపాల మొక్క.. సర్వ రోగాలకు దివ్యౌషధం.. రోగం ఏదైనా ఇట్టే పారిపోవాల్సిందే..!