Ranapala Helath Benefits : ఆయుర్వేదంలో రణపాల బెనిఫిట్స్ గురించి మీకు తెలుసా? ప్రకృతి అందించే అనేక ఔషధాలలో మరో దివ్య ఔషధం ఈ రణపాల మొక్క. రణపాల మొక్కల్లో అనేక అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. మన శరీరంలో వచ్చే దాదాపుగా అన్ని జబ్బులపై అద్భుతంగా పనిచేస్తుంది. తలనొప్పితో పాటు ఒళ్ళు నొప్పులు, డయాబెటిస్, పుండ్లు, రక్తపోటు, చర్మవ్యాధులు గుండె వ్యాధులు, వేడి పొక్కులు, మూత్రనాళాలకు సంబంధించిన అనేక అనారోగ్య సమస్యలకు, రక్త శుద్ధికి, జుట్టు ఆరోగ్యానికి, గ్యాస్ట్రిక్ అల్సర్లకు, మోకాళ్ళ నొప్పులకు, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి అద్భుతంగా రణపాల ఆకు పనిచేస్తుంది. ఈ రణపాల అనేక రోగాలకు అద్భుతమైన పరిష్కారంగా చెప్పవచ్చు. రణపాల ఆకు పేరు చెబితే చాలు.. ఎలాంటి రోగమైన పారిపోవాల్సిందే.
ఈ రణపాల ఆకు.. రణము అంటే శోధన.. పాలు అంటే శాసించేది అని అర్థం వస్తుంది. రణపాల ఆకుని లీఫ్ ఆఫ్ లైఫ్ అని కూడా పిలుస్తారు. ఈ రణపాల జీవాన్ని ఇచ్చే శక్తి కలిగి ఉంటుంది. అందుకే లీఫ్ ఆఫ్ లైఫ్ అని పేరు వచ్చింది. ఈ రణపాలను శాస్త్రీయంగా బయోపిలం అని కూడా పిలుస్తారు. ఈ రణపాల మొక్కకి 10 నుంచి 15 రోజులపాటు నీళ్లు పోయకపోయినా కొంచెం కూడా వాడిపోకుండా ఉంటాయి. ఇందులో కొంత నీరు ఎప్పుడూ ఉంటుంది. అందుకే సగం బలెంట్ లీవ్స్ అని కూడా పిలుస్తారు. ఇక రణపాల ఆకు ప్రధాన ప్రయోజనం ఏమిటంటే.. ఇది కిడ్నీలో రాళ్లకు బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. ఈ ఆకు రసాన్ని తాగితే.. కిడ్నీలో రాళ్లతో పాటు మూత్ర శయాల్లో అడ్డంకులన్నీ వెంటనే తొలగిపోతాయి.
Ranapala Helath Benefits : రణపాల మొక్క ఆకుల రసాన్ని తాగితే..
ఈ రణపాల ఆకుని మెత్తగా నూరి గాయాలపైన వేడి పొక్కుల పైన పూతలా రాసుకుంటే పుండ్లు 2 రోజుల్లో మటుమాయమైపోతుంది. రణపాల ఆకులపై ఉప్పు రాసి మింగినా చాలు. ఈ రసం రక్త శుద్ధికి బాగా పనిచేస్తుంది. రక్తంలో మలినాలన్నీ పోవడమే కాకుండా రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా తొలగిపోయి రక్త ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేస్తుంది. రణపాల ఆకులను మెత్తగా నూరి జ్యూసులా తాగితే.. గ్యాస్టిక్ అల్సర్లు దరి చేరవు. రణపాల ఆకుల జ్యూస్ అద్భుతమైన ఇమ్యూనిటీ బూస్టర్ కూడా పనిచేస్తుంది.

అంతేకాదు.. ఈ ఆకులో ఉన్న యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీ ఎలర్జీ, యాంటీబయోటిక్ గుణాలు, కీళ్ల నొప్పులు, చర్మవ్యాధులు, తలనొప్పి, మెడ నొప్పి వంటి ఎలాంటి రోగానికైనా అద్భుతంగా పనిచేస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే.. రణపాల ఆరోగ్యానికి చేసే మేలు.. అంతఇంతాకాదు.. దాదాపు 30 నుంచి 40 రోగాలకు ఈ రణపాల ఒక్కటే మందుగా చెప్పవచ్చు. ఈ రణపాల మొక్కని మన ఇళ్లల్లోనే పెంచుకోవచ్చు. ఎలాంటి నేలపై అయినా ఈ మొక్క పెరుగుతుంది. పెరట్లోనే ఈ మొక్కను పెంచుకోవచ్చు. ప్రతిరోజు రణపాల చెట్టు ఆకులని తింటుంటే.. ఎటువంటి అనారోగ్యాలు దరి చేరవు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా మీ ఇంట్లో ఈ రణపాల మొక్కను పెంచుకోండి. అనారోగ్య సమస్యలను దూరం చేసుకోండి.