OverSleeping : టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ మానవ జీవనశైలితో అనేక మార్పులు వచ్చాయి. క్రమంగా అవి మనుషులను బద్దకస్తులుగా మార్చేశాయి. ప్రతీది మిషిన్స్ చేస్తుండటంతో శ్రమ తగ్గింది. ఫలితంగా మానవుడు పని సమయంలో శక్తిని ఖర్చు చేయడం తగ్గింది. దీంతో ఉన్నట్టుండి బరువు పెరుగుతున్నారు. తినే ఆహారంలో పోషకాహారలోపం, పొద్దంతా మేల్కొనడం, రాత్రంతా మేల్కొని ఉండటం, కొన్ని సార్లు అతిగా నిద్రపోవడం, అధికంగా ఆలోచించడం, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి వ్యాధులు అటాక్ అవుతున్నాయి. మనిషి తన శరీరాన్ని కష్టపెట్టకపోవడం వలన కేలరీలు కరగడం లేదు. దీంతో బాడీలో కొవ్వు పదార్థాలు పేరుకుపోయి గుండె జబ్బులకు దారీతీయవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అతిగా నిద్రపోతే జరిగే పరిణామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నేటి సమాజంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నార్మల్‌గా ఒక మనిషికి రోజుకు 8 గంటలు నిద్రపోవాలి. ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుకునే వారు చాలా ఆరోగ్యంగా ఉంటారని తెలుస్తోంది. కానీ, 8 గంటల కంటే ఎక్కువగా నిద్రించేవారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకుల అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ మెడికల్ జర్నల్ నివేదిక ప్రకారం.. 62 సంవత్సరాల ఏజ్ ఉన్న దాదాపు 32 వేల మందిపై జరిపిన అధ్యయనాల్లో గుండె పోటు ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు తేల్చారు. మెదడుకు బ్లడ్ సర్క్యూలేషన్‌లో ఇబ్బంది ఏర్పడటం వలన మెదడు కణజాలాలు దెబ్బతింటాయట.. దీంతో హార్ట్ స్ట్రోక్ వస్తుందని తెలిసింది.
అతిగా నిద్రపోయిన వారు త్వరగా బరువు పెరుగుతారని, వీరి శరీరంలో కొవ్వు శాతం పెరిగిపోవడం వలన గుండెపోటు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఒక్కసారి గుండెపోటు వచ్చిన వారిలో నిద్రలేమి సమస్యలు రావడాన్ని వైద్యులు గుర్తించారు. క్రమంగా వీరి జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుందట. ఇలాంటి ప్రమాదాల నుంచి రక్షించుకోవాలంటే.. టైంకు మంచి ఆహారం తీసుకోవాలి. అతిగా నిద్రపోకూడదు. జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ తగ్గించాలి. తరచూ వ్యాయామం, యోగా , కేలరీలను కరిగించేందుకు ఉదయాన్నే వాకింగ్ వంటివి చేస్తుండటం వలన గుండెపోటు ప్రమాదాన్ని నివారించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
Read Also : Sleep Less than 6 hours : ఆరు గంటల కన్నా తక్కువగా నిద్రిస్తే.. ఈ బాధితులు తొందరగా మరణిస్తారట!