Sleep Less than 6 hours : ప్రస్తుత జీవన విధానంలోని అలవాట్లతో మనిషి ఆయుష్షు తగ్గిపోతోంది. వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిలో దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. వేళకు భోజనం చేయకపోవడం, కంటినిండా నిద్రలేకపోవడం, గంటల కొద్ది కంప్యూటర్ల ముందు కూర్చోవడం, మానసిక ఒత్తిడి వంటి అనేక కారణాలు ఆయువును తగ్గిస్తున్నాయని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. అందులో ఎక్కువగా హైబీపీ, డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు రోజులో ఆరు గంటల కంటే తక్కువగా నిద్రిస్తే మాత్రం వారు తొందరగా మరణించే ముప్పు అధికంగా ఉందని అధ్యయనంలో రుజువైంది. వీరిలో ఎక్కువగా హార్ట్ ఎటాక్ సమస్యలు అధికంగా వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.. డయాబెటిస్, హైబీపీ ఉందా? 6 గంటల కంటే తక్కువగా నిద్రిస్తే తొందరగా మరణిస్తారట!
లేదంటే ఆయుష్షు తగ్గిపోతుంది :
ఆరోగ్యం కోసం ప్రతిఒక్కరూ ప్రతిరోజూ వ్యాయామం చేస్తుండాలి. అలాగే సరైన వేళకు ఆహారాన్ని తీసుకోవాలి. మంచి ప్రోటీన్లు, పోషకాలతో నిండిన ఆహారాన్ని ఎక్కువుగా తీసుకుంటుండాలి. రోజుకు 8 గంటల నిద్ర చాలా అవసరం.. అలా కుదరని పక్షంలో కనీసంగా రోజుకు 6 గంటలైన నిద్రపోవాలి. లేదంటే ఆయుష్షు తగ్గిపోతుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
అమెరికాకు చెందిన పరిశోధకులు ల్యాబొరేటరీలో 1600 మందిపై అధ్యయనం నిర్వహించగా.. వారిని రాత్రంతా నిద్రపోవాల్సిందిగా సూచించారు. వారిలో అప్పటికే ఉన్న అనారోగ్య సమస్యల ప్రభావం వారిపై ఎంతవరకు ప్రభావం చూపుతున్నాయో పరిశోధించారు. ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారో ట్రాకింగ్ చేస్తు వచ్చారు. వీరిలో కేవలం మూడేళ్లలో డయాబెటిస్, హైబీపీ సమస్యలు ఉన్నవారు గుండెపోటుతో మరణించారని గుర్తించారు. ప్రధానంగా హైబీపీ సమస్యతో బాధపడేవారంతా కేన్సర్ వ్యాధితో, డయాబెటిస్ సమస్య ఉన్నవారు గుండెపోటుతో మరణించినట్టు పరిశోధకులు నిర్ధారించారు.
నిద్రకు ఆయుష్షుకు లింక్ ఉంది :
నిద్రకు ఆయుష్షుకు లింక్ ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. మనం నిద్రించే సమయాన్ని బట్టి మన ఆయుష్షు ఉంటుందని సూచిస్తున్నారు. రోజుంతా ఎంత పనిచేసినా నిద్రించే సమయంలో శరీరానికి కావాల్సినంత విశ్రాంతిని ఇవ్వాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. కానీ, అనవసరమైన ఆలోచనలతో మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. ఇదే మనిషిని మరింత కృంగదీస్తోంది.
మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. ఒత్తిడికి గురిచేసే ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఎక్కువ సమయం ఫోన్లు, టీవీలను చూడకూడదు. అదేపనిగా కాఫీ, టీలు తాగ కూడదు. ఎందుకంటే అందులో కెఫెన్ అనే పదార్థం ఉంటుంది. దాంతో మీకు నిద్ర పట్టదు. అలాగే రాత్రూల్లో బ్లూ స్క్రీన్ చూడటం వల్ల నిద్ర పట్టదు.
అందుకే వైద్యులు ఫోన్ చూడొద్దని చెబుతుంటారు. ఇక డయాబెటిస్. హైబీపీ ఉన్నవాళ్లంతా ఎక్కువ సమయం నిద్రపోయేందుకు ప్రయత్నించాలి. అప్పుడే వారిలో ఆయుర్దాయం పెరుగుతుంది. లేదంటే తొందరగా చనిపోయే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అతినిద్ర కూడా డేంజరే :
సాధారణంగా ప్రతిజీవికి నిద్రించే సమయం ఉంది. ఆ సమయాన్ని బట్టి ఆయా జీవులు నిద్రిస్తుంటాయి. కొన్ని జీవులు నిద్రాణవస్థలోకి వెళ్లిపోతాయి. దీర్ఘకాలం పాటు నిద్రిస్తుంటాయి. ఏప్రాణికి ఎంత నిద్ర అవసరమో అంతే నిద్రపోవాలి.. అంతకంటే మించి నిద్రపోయినా ఇబ్బందే.. తక్కువగా నిద్రపోయినా ఇబ్బందేననే విషయాన్ని గుర్తించాలి. వేళకు నిద్రపోవాలి.. వేళకు ఆహారం తీసుకుంటుండాలి. అలాగే ఒత్తిడికి గురిచేసే విషయాలకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకున్నప్పుడే అనారోగ్య సమస్యలు దరిచేరవని అంటున్నారు.
ఒత్తిడి హార్మోన్ కారణంగా.. నిద్రపట్టదు. ఎక్కువగా అలసిపోతుంటారు. నిద్రపోయేందుకు ప్రయత్నించినా నిద్ర రాదు. పడక మీద పడుకుంటారే తప్ప నిద్ర రాదు. కళ్లు మూసుకుంటే నిద్రపోయినట్టు కాదు.. నిద్ర రావాలంటే.. రాత్రి పడుకునే ముందు కొన్ని చిన్నపాటి రెమడీలను ట్రై చేయండి.. దీర్ఘశ్వాస తీసుకోవడం, ప్రాణాయామం, మెడిటేషన్, యోగ వంటి వ్యాయాయాలు చేయడం ద్వారా తొందరగా నిద్రపట్టేలా చేసుకోవచ్చు. ఇలా చేసినప్పుడు మీ శరీరం విశ్రాంతిని కోరుతుంది. ఫలితంగా నిద్ర అవహిస్తుంది.
నెగటివ్ ఆలోచనలు తగ్గించుకోండి :
నెగటివ్ ఆలోచనలు మానేయండి.. ఇవే మీ నిద్రకు ఆటంకం కలిగిస్తుంటాయి. ఆలోచనలు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. డయాబెటిస్, హైబీపీ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎప్పుడూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. టెన్షన్ మీ ప్రాణం తీస్తుందని గుర్తించుకోండి. ప్రతి చిన్నవిషయానికి టెన్షన్ పడొద్దు. అది జీవితకాలాన్ని తగ్గిస్తుందని మరిచిపోవద్దు..
మీ ఆయుష్షు మీ చేతుల్లోనే ఉందని గుర్తించుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవసరమైన అన్ని విటమిన్లు, ప్రోటీన్లు, సప్లిమెంట్లు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. శరీరంలో పేరుకుపోయినా అనవసరమైన కొవ్వును కరిగించుకోవాలి. స్థూాలకాయం కూడా మనిషి ఆయువును తగ్గిస్తుందని గుర్తించాలి. అధిక బరువు సమస్యతో బాధపడేవారిలోనూ గుండెజబ్బులు అధికంగా ఉంటున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో మిలియన్ల మంది బాధపడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఈ వ్యాధులు చాలామందిని పట్టిపడీస్తున్నాయి. ఒకసారి మీరు ఈ వ్యాధుల బారినపడ్డారంటే అంతే.. జీవితంతం బాధపడాల్సిందే.. ఇప్పటివరకూ డయాబెటిస్, షుగర్ వ్యాధులకు నియంత్రణ మందులు ఉన్నాయే తప్పా.. పూర్తిగా తగ్గించే మందులు ఎక్కడా లేవని గుర్తించాలి. అనవసరమైన టెన్షన్లతో షుగర్, బీపీలు తెచ్చుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. చాప కింద నీరులా వ్యాపించే ఈ వ్యాధుల కారణంగా మనిషి ఆయువు తొందరగా తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు.
నిద్రపోయే ముందు ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉంచుకోవాలి. అప్పుడే మీకు మంచిగా నిద్రపడుతుంది. అలాంటివారిలో అనారోగ్యసమస్యలు దగ్గరకు రావు. ప్రాణాంతక వ్యాధులు బారినపడేవారిలో ఎక్కువగా నిద్రలేమి సమస్య ఉన్నవారే ఉన్నారని పలు అధ్యయనాల్లో తేలింది. అందుకే నిద్ర విషయంలో అసలు నిర్లక్ష్యం చేయొద్దని సూచిస్తున్నారు నిపుణులు. ఎన్ని పనులు ఉన్నా నిద్రపోవాలి. తొందరగా నిద్రపోయి.. వేకువజామునే నిద్రలేవాలి. అప్పుడు మీ మైండ్ బాగా పనిచేస్తుంది.. ఎక్కువగా పనిచేయగలరు.. కంటినిండా నిద్రపోయేవారు ఆ రోజుంతా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
Read Also : Negative Energy Bathroom : మీ ఇంట్లో సమస్యలా.. బాత్‌రూమ్స్‌లో నెగటివ్ ఎనర్జీని తొలగించుకోండిలా