Diabetes Risk : స్మార్ట్ ఫోన్ లేకపోతే ఈ రోజుల్లో ఏ పని కాదన్నది వాస్తవం. స్మార్ట్ ఫోన్ దగ్గర ఉందంటే ప్రపంచం మొత్తం మన కళ్ల ముందు ఉన్నట్టే.. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వారు ఎవరైనా ఉన్నారంటే అతన్ని వింతగా చూస్తుంది ఈ సమాజం. చిన్నపిల్లల దగ్గరి నుంచి జాబర్స్, వృద్ధులు కూడా స్మార్ట్ ఫోన్స్ వినియోగిస్తున్నారు.
బ్యాకింగ్, స్టాక్ మార్కెట్స్, టిక్కెట్స్ బుకింగ్ ఇలా ఏ పని అయినా స్మార్ట్ ఫోన్స్‌తో చేసుకోవచ్చు. అంతలా మన శరీరంలో ఒక భాగం అయిపోయింది స్ట్మార్ట్ ఫోన్. చేతిలో ఫోన్ లేకపోతే బాడీలో ఒక భాగం లేనట్టే అనిపిస్తుంది. పనులన్నీ ఆగిపోతాయి. ఏ పని చేయలని పరిస్థితి ఈ స్మార్ట్ ఫోన్స్ క్రియేట్ చేశాయి. మనిషిని బద్దకస్తుడిగా మార్చేశాయి. చాలా మంది ఉదయం నుంచి రాత్రి వరకు స్మార్ట్ ఫోన్లతో ఆడుతుంటారు.

అయితే, పొద్దున వాడటం కంటే రాత్రి ఫోన్ వాడితే ఎక్కువగా దుష్పలితాలు వస్తాయట.. ముఖ్యంగా కళ్లపై ఎక్కువ ప్రభావం పడి షుగర్ వ్యాధి వచ్చేందుకు ఆస్కారం ఉందట.. ఇది ఏదో నోటి మాటకు చెప్పేది కాదు.. స్ట్రాస్‌బర్గ్ యూనివర్శిటీ, ఆమ్‌స్టర్ డామ్ యూనివర్శిటీ సైంటిస్టులు ఎలుకలపై చేసిన పరిశోధనల్లో ఈ నిజాలు వెల్లడయ్యాయి. రాత్రి కృత్రిమ వెలుతురులో ఎలుకలను ఉంచగా ఆ కాంతి వలన వాటి రక్తంలో చక్కెర స్థాయి పెరగడాన్ని గుర్తించారట..
Diabetes Risk : స్మార్ట్ ఫోన్ కాంతి వల్లనే డయాబెటిస్ వ్యాధి వస్తుందట..
అదే బ్లూ లైట్ మన మొబైల్ నుంచి రాత్రి వేళల్లో ఎక్కువగా మన కళ్లపై ప్రసారం అవుతుంది. అలా ఎక్కువ కాలం ఆ కాంతి మన కళ్లపై పడితే మన శరీరంలో కూడా చక్కెర స్థాయి పెరుగుతుందని, స్వీట్ తినాలనే కోరిక మనిషికి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఎక్కువగా తియ్యని పదార్థాలు తినడం వలన ఉబకాయం పెరుగుతుందట.. దీంతో క్రమంగా అది డయాబెటీస్ వ్యాధికి కారకం అవుతుందని సైంటిస్టుల చెబుతున్నారు. అందుకే రాత్రి పూట సెల్ వాడే వారు బ్లూలైట్ నేరుగా కళ్లపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
Read Also : Control Blood Sugar : మీకు షుగర్ ఉందా.. ఆ సమయంలో వీటి జోలికి అసలే వెళ్లొద్దు..!