Mint Leaves : చాలా మంది ఆడ, మగవారిలో కళ్ల కింద నల్లటి వలయాలు అవుతుంటాయి. అయితే, ఇవి వయస్సు మీద పడుతున్న కొద్దీ అవుతుంటాయని కొందరు అనుకుంటారు. కానీ, మన శరీరంలో విటమిన్ లోపం, కాలుష్యం, నిద్ర లేకపోవడం, స్పెస్ట్స్ ధరించడం వంటి కారణాల వలన కూడా జరుగుతుంది. అయితే, కొందరు ఆడవాళ్లు తాము ఎంత అందంగా ఉన్నా, కళ్ల కింద నల్లని చారలు రావడంతో తెగ బాధపడుతుంటారు.
వాటిని పోగెట్టేందుకు మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు వాడుతుంటారు. ఇలా చేయడం వలన నల్లని చారలు పోవడమనే మాట అటుంచితే కొత్త సమస్యలు కూడా ఏర్పడవచ్చు. అందుకే మన ఇంట్లో దొరికే వంటింటి ఔషధం వలన బ్లాక్ స్పాట్స్‌కు పర్మినెంట్‌గా చెక్ పెట్టవచ్చంట.. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా ఆకులు.. వంటింట్లో ఉపయోగించే ఒక ఔషధమని చెప్పవచ్చు. ఇందులో ‘మెంతాల్’అనే మెడిసిన్ ఉంటుంది. దీని ద్వారా మొహంపై ఉన్న నల్లని వలయాలను త్వరగా నివారించవచ్చు. ఎలాగా అంటే.. ఒక ఆఫ్ టమోట తీసుకోవాలి. ఇందులో బ్లీచింగ్ గుణం ఉంటుంది. పూదీన ఆకులు, టమోట మెత్తగా నూరుకుని ఆ మిశ్రమాన్ని నల్లని చారలు ఉన్నదగ్గర అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తుంటే బ్లాక్ స్పాట్ మటుమాయం.
అదేవిధంగా పూదీన ఆకులను ఉడకబెట్టని పావు వంతు ‘బంగాళదుంప’తో మొత్తగా చేసుకోవాలి. దీని రసాన్ని చల్లని ప్రదేశంలో కాసేపు ఉంచి ఆ తర్వాత కాటన్‌తో అప్లై చేసుకుని కాసేపయ్యాక వాష్ చేసుకోవాలి. ఈ రెండింటితో పాటే పూదీన ఆకులను శనగపిండితో గానీ, ఆముదం లేదా ఆవ నూనెతో గానీ, రోజ్ వాటర్, బాదాం నూనె మరియు కీరదోసతో గానీ ఇలా అన్నింటిలో మిక్స్ చేసుకుని తరుచూ వాడుతూ ఉంటే నల్లని వలయాలు పూర్తిగా దూరమై మొహం అందంగా మెరిసిపోతుంటుంది.
Read Also : Mint Leaves : పీరియడ్స్ ఉన్నప్పుడు పుదీనా తింటే.. ఈ ప్రాబ్లమ్స్ రానే రావట.. తెలుసా?