Low BP in Telugu : మీరు లో బీపీ సమస్యతో బాధపడుతున్నారా? అసలు లో బీపీ (Low BP) అంటే ఏంటి? వైద్య పరిభాషలో సాధారణంగా ఎవరికైనా బ్లడ్ ప్రెజర్ రీడింగ్‌లు (90/60mmHg) లేదా అంతకంటే తక్కువగా ఉంటే దాన్ని హైపోటెన్షన్ (Hypotension) అంటారు. లో బీపీని హైపోటెన్షన్ అని కూడా అంటారు. ఇలా జరిగినప్పుడు శరీరంలోని రక్తపోటు (Low Blood Pressure in Telugu) భారీగా పడిపోతుంది. హఠాత్తుగా బ్లడ్ ప్రెజర్ తగ్గుముఖం పడుతుంది. ఇలాంటి లక్షణాలు వెంటనే అర్థమవుతాయి. శరీరంలో ప్రవహించే రక్తం.. గుండె లోపల ధమనులకు ప్రతి బీట్‌తో వ్యతిరేకంగా ప్రసరిస్తుంటుంది. ధమనుల గోడలపై రక్తం నెట్టడాన్ని రక్తపోటుగా పిలుస్తారు. రక్త ప్రవాహంలో ఒత్తిడి తగ్గినప్పుడు కలిగే పరిస్థితినే తక్కువ రక్తపోటు లేదా హైపోటెన్షన్ అని పిలుస్తారు.
రక్తపోటు అనేది రెండు సంఖ్యలలో సూచిస్తారు. మొదటిది సిస్టోలిక్ కొలత, ఆ తరువాత డయాస్టొలిక్ కొలతగా చెప్పవచ్చు. గరిష్ట సందర్భాలలో (120/80 కన్నా తక్కువ) లో బీపీని కలిగి ఉండటం మంచిది. అయినప్పటికీ, చాలా లో బీపీ కలిగి ఉండటం కొన్నిసార్లు స్పృహ కోల్పోతారు. పెద్దవారిలో లో బీపీ ఉన్నప్పుడు తద్వారా హైపోటెన్షన్ (90/60) కన్నా తక్కువగా రక్తపోటు రీడింగ్‌గా సూచిస్తుంది. ఈ పరిస్థితిని బట్టి లో బీపీ లక్షణాలను గుర్తించవచ్చు. తక్కువగా రక్తపోటు లేదా హైపోటెన్షన్ గురించి పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
డేంజరస్ లో బీపీ అంటే ఏమిటి? :
రక్తపోటు రీడింగ్‌లు (90/60mmHg) లేదా అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు.. వైద్యపరంగా హైపోటెన్షన్ అని పిలుస్తారు. రక్తపోటు కొలత మిల్లీమీటర్ల పాదరసం (mmHg) ఉపయోగించి కొలుస్తారు. రక్తపోటు చాలా తక్కువకు పడిపోయినప్పుడు.. మెదడు, మూత్రపిండాలు, గుండె వంటి అవయవాలకు రక్త సరఫరాలో అకస్మాత్తుగా తగ్గుదల ఏర్పడుతుంది. ఇలా తగ్గిన రక్త సరఫరా దీర్ఘకాలంలో కొన్ని సంక్లిష్టమైన ఆరోగ్య పరిస్థితులకు దారితీస్తుంది. రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి.
లో బీపీ లక్షణాలు ఇవే :
ఇలాంటి పరిస్థితికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లో బీపీకి సంబంధించిన లక్షణాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
* అలసట
* వికారం
* అధిక చెమట
* చమటమైన చర్మం
* స్పృహ కోల్పోవడం
* శ్వాస ఎక్కువగా తీసుకోవడం
* మూర్ఛ రావడం
* గందరగోళం
* దృష్టి మసకగా ఉండటం
* చాలా నిరసంగా అనిపిస్తుంది
* అనారోగ్యంగా అనిపించడం
* తలతిరగడం

BP చాలా తక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే? :
లో బీపీకి చికిత్స వెంటనే తీసుకోవాలి. లో బీపీ సమస్యను ఇంట్లోనే ఉండి రెమడీలను పాటించవచ్చు. ఇంట్లో లో బీపీని ఎలా కంట్రోల్ చేయొచ్చు ఇప్పుడు తెలుసుకుందాం.. లో బీపీ సమస్యను నివారించాలంటే ఈ కిందివిధంగా ప్రయత్నించండి..
* తక్కువ వ్యవధిలో కొద్దికొద్దిగా భోజనం తినండి.
* కొంచెం ఉప్పు ఎక్కువగా తీసుకోవాలి.
* కంప్రెషన్ స్టాకింగ్స్ ధరించండి.
* త్వరగా లేవకండి లేదా చుట్టూ తిరగకండి
* అధిక ఆల్కహాల్ తీసుకోవడం మానండి.
* నీరు ఎక్కువగా తాగాలి
* బాదం, ఎండుద్రాక్ష తీసుకోవాలి.
* మీ భోజనంతో పాటు కాఫీ తాగండి.
* ఒక కప్పు లైకోరైస్ టీని తాగండి.