Gastric Problems : ఎసిడిటీ, గ్యాస్, మలబద్దకానికి ఇంట్లోనే పర్మినెంట్ వైద్యం.. మందులతో పనిలేదు.. అద్భుతమైన రెమిడీ..!

Gastric Problems in telugu : ప్రస్తుత సమాజంలో ప్రతీ 10 మందిలో ఆరు నుంచి ఎనిమిది మంది ఎసిడిటీ, గ్యా్స్ట్రిక్, మలబద్దకంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం తీసుకునే ఆహారంలో లోపమే అని తెలుస్తోంది. సమయానికి ఫుడ్ తీసుకోకపోవడంతో జీర్ణం కాక, కడుపులో మంట, అజీర్తి, మల బద్దకం, గ్యాస్ట్రిక్, తేల్పులు రావడం, కడుపు ఉబ్బరంగా ఉండటం వంటి సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు. దీనివలన గుండెలో నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

సమయానికి తినకపోవడం వల్లే ఎసిడిటీ సమస్య..
అయితే, బయట చిరుతిండ్లు, కల్తీ ఆయిల్‌తో చేసిన పదార్థాలు, మసాలా ఎక్కువగా ఉన్న వంటకాలు తినడం వలన కూడా ఎడిసిటీ సమస్య ఉత్పన్నమవుతుంది.దీనిని ఇలాగే వదిలేస్తే చాలా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పూర్తిగా చెడిపోతుంది. టైంకు ఆహారం తీసుకోకుండా ఆలస్యం చేస్తుండటం వలన జీర్ణాశయంలో యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఫలితంగా కడుపులో మంట ఏర్పడుతుంది. దీనిని ఇలాగే వదిలేస్తే అల్సర్ వ్యాధికి కారకం అవుతుంది.

gastric problems home remedies in telugu
gastric problems home remedies in telugu

వన్స్ అల్సర్ అటాక్ అయితే, ఏది తినాలన్నా ఆలోచించాల్సిందే. మసాలా వస్తువులు, పుల్లటి పదార్థాలు తిన్నా ఛాతిలో తీవ్రమైన మంట ఏర్పడుతుంది. ట్యాబ్లెట్లు వాడితో ఈ పెయిన్ తగ్గిపోవచ్చు. కానీ మరల కొంతకాలానికి ఈ సమస్య రావొచ్చు. ఎసిడిటీని తగ్గించుకోవడానికి మాత్రలు తీసుకునే బదులు, వంటింట్లో దొరికే వస్తువులతోనే దీనికి శాశ్వతంగా చెక్ పెట్టొచ్చట. అది ఎలాగో ఇపుడు తెలుసుకుందాం..

తయారీ విధానం.. : 
* ఒక గ్లాసు నీటిలో 20ఎంఎల్ వేడిచేసి చల్లార్చిన పాలు కలిపి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసుకుని బాగా కలపాలి. కడుపులో మండిన సమయంతో తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఎసిడిటీ ఉన్న వారు ఆహారం తీసుకున్నాక తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

*  జీలకర్రను రెండు నుంచి మూడు నిమిషాలు ఒక కడాయిలో వేయించుకోవాలి. తర్వాత మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. అందులో అర స్పూన్ పసుపు, అర స్పూన్ బ్లాక్ సాల్ట్, వేడిచేసిన నిమ్మరసం ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తాగేయాలి. ఇది తీసుకున్న 30 సెకన్లలోనే పనిచేయడం ప్రారంభమవుతుంది. ఇలా క్రమంగా కొద్దిరోజులు చేస్తుంటే పూర్తిగా ఎసిడిటీ సమస్య తగ్గిపోతుంది.

Read Also :  Acidity : ఎసిడిటీ ఇబ్బంది పెడుతోందా… వీటితో చెక్ పెట్టండి..

Leave a Comment