Honey health benefits : తేనె గురించి మీకు తెలియని కొన్ని నిజాలు.. నిద్రలేమికి పూర్తిగా చెక్..?

Honey health benefits :  తేనె.. అనారోగ్య సమస్యలకు ఓ సంజీవనిలా పనిచేస్తుంది. ఇంగ్లీష్ మెడిసిన్, ఆయుర్వేదం, వంటింట్లో కూడా తేనెను బాగా ఉపయోగిస్తుంటారు. దీని వాడకం వలన అనేక ప్రయోజనాలున్నాయి. పూర్వం నుంచి ఆయుర్వేద వైద్య విధానాల్లో తేనెను విరివిగా వినియోగిస్తుంటారు. పాలల్లో, నీళ్లల్లో కలిపి తేనెను తీసుకోవచ్చు. దీని వలన శరీరానికి ఇన్‌స్టాంట్ శక్తి చేకూరుతుంది. అయితే, తేనెను మన దైనందిన జీవనంలో భాగం చేసుకోవడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Honey healthbenefits
Honey healthbenefits
కఫం, తీవ్ర దగ్గుతో బాధపడుతున్న వారు తేనెను తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. దీనివలన గొంతు కూడా ఫ్రీ అవుతుంది. టీస్పూన్‌లో కొద్దిగా అల్లం రసం తీసుకుని అందులో టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేయాలి.  ఆ మిశ్రమాన్ని తీసుకోవడం వలన త్వరిగతిన దగ్గు తగ్గిపోతుంది. అంతేకాకుండా గాయాలను తగ్గించే శక్తి తేనెకు ఉంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ గుణాలున్నాయి. దీంతో గాయాలను మాన్పించే గుణాలు దీనికి ఉన్నాయి. గాయం మీద తేనె రాస్తే త్వరగా హీలింగ్ అవుతుంది. చర్మ సౌందర్యంతో పాటు ఆరోగ్యానికి కూడా తేను చాలా బాగా ఉపయోగపడుతుంది. నాచురల్ మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది.

ప్రస్తుత రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. దీంతో రాత్రి త్వరగా బెడ్ మీదకు చేరుకున్నా నిద్ర పట్టదు. ఎంత ప్రయత్నించినా ఏదో ఆలోచనలు  రావడంతో నిద్ర పక్కకు వెళ్లిపోతుంది. అటువంటి వాళ్ళ రాత్రి పడుకునే ముందు కొద్దిగా తేనె తీసుకుంటే హాయిగా నిద్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు. గోరు వెచ్చని పాల లో కొద్దిగా తేనె వేసుకుని తాగాలి. పాలు, తేనె నిద్రకు మంచి కారకం.. జీర్ణసమస్యలకు కూడా చెక్ పెడుతుంది తేనె..అంతేకాకుండా పెదవులకు తేనె రాయడం వలన పొడిబారకుండా ఉంటాయి. చలికాలంలో చర్మం పొడిబారకుండా, పెదాలు తేమను కోల్పోకుండా ఉండాలంటే తేనెను వాడితే సరి.. తరచుగా తేనె తీసుకోవడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఏదైనా వ్యాధుల బారిన పడినప్పుడు పోరాడేందుకు ఎంతో శక్తినిస్తుంది.

Read Also :  Remove blackheads on Nose : ముక్కుపై బ్లాక్ హెడ్స్ పోవాలంటే ఈ వంటింటి చిట్కాలు ట్రై చేయండి!

Leave a Comment