Heart Attack : ప్రస్తుతం చాలా మంది గుండెపోటు బారిన పడి మరణిస్తున్నారు. దీనికి అనేక కారణాలున్నాయి. ఒత్తిడి, డిప్రెషన్, గుండెకు రక్తప్రసరణ సరిగా జరగకపోవడం, శరీరంలో అధికకొవ్వు పేరుకపోవడం వంటివన్నీ గుండెపోటుకు కారకాలు కావొచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గుండెపోటు వచ్చిన గంటలోనే రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లగలిగితే బతికే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గుండె నొప్పి వచ్చిన గంట వరకు శరీరంలో రక్తం సరఫరా అవుతుందని, ఆ సమయం దాటితే సరఫరా ఆగిపోతుందని.. దీంతో గుండె కొట్టుకోవడం ఆగిపోయి వ్యక్తి మరణిస్తాడని వైద్యులు స్పష్టం చేశారు.
గుండె పోటు సంకేతాలు..
గుండె పోటు వచ్చేవారిలో ముందుగా బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది. గుండెకు బ్లడ్ సరఫరా కాకపోతే ఛాతిలో మంటగా అనిపిస్తుంది. తరచుగా జలుబు, జ్వరం, దగ్గు రావడం, ఎన్నిమందులు వాడినా తగ్గకపోవడం కూడా కారణం కావొచ్చు. ముఖ్యంగా శరీరంలో మెడ భాగం నుంచి ఎడమ చేతి వైపు పెయిన్‌గా ఉంటే అది తప్పకుండా హార్ట్ స్ట్రోక్‌కు సంకేతంగానే భావించాలి. గుండె బరువుగా అనిపించినా.. తీవ్రమైన అలసట, ఒళ్లు నొప్పులు ఉన్నా నిర్లక్ష్యం చేయరాదు. ఆహారం అరగకపోయినా, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది.

ఏమి చేస్తే గుండె పదలంగా ఉంటుంది..
గుండె నొప్పి రాకుండా ఉండాలంటే జంక్ ఫుడ్, మాంసానికి బదులు ఆకు కూరలు ఎక్కువగా తినాలి. పాలకూర, కొత్తమీర, ముల్లంగి వంటి ఎక్కువగా తిన్నా ఇబ్బంది ఉండదు. వీటిలో ఫోలిక్ యాసిడ్, కాల్షియం, మెగ్నీషియం, పోటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. గుండె పనితీరును మెరుగు పర్చడంలో బాగా సహాయపడతాయి. అలాగే ఓట్స్, గోధుమలు, పప్పు ధాన్యాలు, బార్లీ, బీన్స్, పండ్లు, చేపలు మొదలైనవి తినడంతో పాటు రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి.
యోగాను కూడా ఫాలో అవుతే ఆరోగ్యంగా బాగుంటుంది. ఎటువంటి గుండెనొప్పులు దరిచేరవు. ఆహారంలో తీసుకోవడం మంచిది. వీటిలో ఉండే విటమిన్స్, ఐరన్, ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. దీని ద్వారా గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఇవే కాకుండా టోమాటోలు, యాపిల్స్, సోయా వంటివి రోజువారీగా తీసుకున్నట్లయితే గుండెను పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.