Health Benefits of Lemons : నిమ్మకాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. నిమ్మలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. నిమ్మ సిట్ర ఆమ్లం ఫ్రూట్.. గజ నిమ్మ పండు పండు దళసరిగా ఉంటుంది. పండినప్పుడు పసుపు లోపటి గుజ్జు రంగులో ఉంటుంది. చిన్న నిమ్మ పండు తోలు పల్చగా ఉంటుంది. ఆయుర్వేదంలో నిమ్మను (జంభీరం) అని పిలుస్తారు.. నిమ్మలో అద్భుతమైన ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు… నిమ్మరసంలో68% సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. (రక్తస్రావాన్ని) ఆపడానికి ఉపయోగపడుతుంది. ఎక్కిళ్లను, చెమట పుట్టించడానికి ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పులు, చర్మంపై దురదలు ఉన్నప్పుడు నిమ్మరసం పనిచేస్తుంది.

నిమ్మకాయను ఏ విధంగా వాడుకోవాలంటే? :
నిమ్మకాయ తోలు సాఫ్ట్ గా ఉన్నది రసం ఎక్కువగా ఉంటుంది.నిమ్మరసం కొన్ని చుక్కలు అవసరమైనప్పుడు చిన్న రంద్రం చేసి కావలసినంత నిమ్మరసం తీసి నిమ్మకాయకు ప్లాస్టర్ అంటించి ఫ్రిజ్లో పెట్టుకుంటే తాజాగా ఉంటుంది. మళ్లీ కావలసినప్పుడు వాడుకోవచ్చు.. లెమన్ టీ లో పంచదార స్పటికాలు నిమ్మరసం ముంచి వేడి వేడి డికాషన్ లో కలిపితే టీ చక్కటి సువాసన పెద చల్లుతుంది. నీళ్లలో కలిపి స్ప్రే బాటిల్ పోసి రూమ్ అంతా స్ప్రే చేస్తే పరిమళంగా, తాజాగా ఫ్రెష్ గా ఉంటుంది.
నిమ్మను పాత్రలను శుభ్రం చేయడానికి వాడుకోవచ్చు. రాగి పాత్రలను ఉప్పు వేసి (తల తల) మెరిసిపోతాయి. కూరగాయలు కోసే బోర్డును, షాకు, కత్తులు గ్యాస్ స్టవ్ పై ఉన్న జిడ్డు పోయి శుభ్రమైతాయి. బట్టల పై కాపీ మరకలు పడ్డ నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు. బాత్రూం క్లీన్ చేయొచ్చు. ప్లాస్టిక్ డబ్బాలపై జిడ్డు పేర్కొన్నప్పుడు నిమ్మరసం వేసి ఆఫెన్ అవర్ తర్వాత కడిగితే శుభ్రం అవుతుంది.
ఆపిల్, జామ, అరటిపండు కట్ చేసి పక్కన పెట్టినప్పుడు కలర్ చేంజ్ అవుతా చాలా అవకుండా నిమ్మరసం చల్లితే తాజాగా ఉంటాయి. చేతి వేళ్ళ గోర్లు మృదువుగా ఉండాలంటే నిమ్మ చెక్కను రుద్దితే గోర్లు మెరుస్తాయి. బట్టలు ఉతికినప్పుడు నిమ్మరసం వేసి బట్టలు జాడిస్తే మంచి సువాసన ఉంటాయి.!!
నిమ్మ ఔషధ విలువలు :
నిమ్మకాయలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని తెలిసిందే. నిమ్మతో దంతపరమైన సమస్యలను నివారించుకోవచ్చు. ఎసిడిటీ, గౌట్, మలబద్ధకం, ఎలర్జీలకు అద్భుతంగా పనిచేస్తుంది. జలుబుతో బాధపడేవారికి కూడా నిమ్మ దివ్యౌషధంగా పనిచేస్తుంది. చికెన్ పాక్స్? (ట్రాన్స్ లైటీస్), చెవి నొప్పి? కంటి సమస్యలు, అల్సర్స్? ఫైల్స్, యూరిన్ ఇన్ఫెక్షన్? అధిక బరువు, చాతిలో మంట వంటి అనేక అనారోగ్య సమస్యలకు కూడా నిమ్మ ఔషధ గుణాలు అద్భుతంగా పనిచేస్తాయి.