Pulao Style Vegetable Biryani : నోరూరించే వెజ్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా? ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినేస్తారు.. రెస్టారెంట్ స్టయిల్ వెజ్ బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతేకాదు.. క్షణాల వ్యవధిలోనే నోరూరించే వెజ్ బిర్యానీని తయారుచసుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్ లేదా ఇంట్లో శుభాకార్యాల్లో కూడా ఇలా పులావ్ వెజిటేబుల్ బిర్యానీ చేసి పెడితే కుటుంబ సభ్యులంతా చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. చాలా టేస్టీగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు.. బియ్యం -, నూనె, నెయ్యి -1 టేబుల్ స్పూన్, టమాట -3, పుదీనా -1 కట్ట, కొత్తిమీర – 1కట్ట, పచ్చిమిర్చి -12, ఉల్లిపాయ -1, ఉప్పు (రుచికి తగినంత) అల్లం, పచ్చి బఠానీ -1/2 కప్పు, క్యారెట్ -1, ఆలుగడ్డ -1, సాజీర -1 టీ స్పూన్, యాలకులు-3, లవంగాలు-4, మరాటి మొగ్గ-1, స్టార్ పువ్వు 1, కస్తూరి మేతి, పువ్వు, బిర్యానీ ఆకులు- 3, బిర్యానీలోకి కావలసిన పదార్థాలు ఇవి….
తయారీ విధానం… గుప్పెడంత పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి (8) ఒకటి అల్లం ముక్క మూడు టమాటాలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక గ్లాస్ బియ్యాన్ని ఒక బౌల్లో వేసి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి బిర్యానీ ఆకు మూడు, ఒక అనాసపువ్వు, ఒక మరాటి మొగ్గ, రెండు ఇంచులు దాల్చిన చెక్క, నాలుగు లవంగాలు, మూడు యాలకులు, కొంచెం కస్తూరి మేతి, సాజీర, ఒక్క పువ్వు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ కొంచెం వేగిన
![Pulao Style Vegetable Biryani : నోరూరించే వెజ్ బిర్యానీ ఇన్‌స్టంట్‌గా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు.. ఒకసారి తిన్నారంటే మళ్లీ కావాలంటారు..! Pulao Style Vegetable Biryani](https://mearogyam.com/wp-content/uploads/2023/04/Pulao-Style-Vegetable-Biryani.jpg)
తర్వాత సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు పచ్చి బఠాణి, నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసిన ఆలు ముక్కలు (ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్న వేసుకోవచ్చు) టీ స్పూన్ ఉప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. (పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం టమాట) ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంతవరకు వేయించాలి.
ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలపాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి విరగకుండా నెమ్మదిగా కలపాలి. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోసి రుచికి తగినంత ఉప్పు ఉందో లేదో చూసుకుని కొంచెం యాడ్ చేసుకోండి కుక్కర్ మూత పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ అంత పోయిన తర్వాత కుక్కర్ మూత తీయండి బిరియాని పొడిపొడిగా ఎంతో రుచికరమైన (ఇన్స్టెంట్) వెజ్ బిర్యానీ రెడీ…