Gas Pain-Heart Attack : మనుషులు అపానవాయువు (గ్యాస్) వదలడం సాధారణం, సహజమే. మలవిసర్జన సమయంలో దాదాపుగా ప్రతీ ఒక్కరు అపానవాయువును వదులుతుంటారు. అయితే, ఈ గ్యాస్ ట్రబుల్ కాస్తా హార్ట్ వరకు వచ్చి హార్ట్ అటాక్‌కు దారి తీసే చాన్సెస్ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే గ్యాస్ నొప్పికి, గుండె నొప్పికి మధ్య గత తేడాలను ప్రతీ ఒక్కరు గుర్తించాల్సిన అవసరముంది. ఎందుకంటే గ్యాస్ వల్ల కూడా చాతిలో నొప్పి వస్తుంది. అది అలా గుండె నొప్పికి దారి తీస్తుందనే భయాలు కూడా చాలా మందిలో ఉంటాయి. ఈ క్రమంలోనే అసలు గుండెనొప్పికి, గ్యాస్ నొప్పికి మధ్య గల తేడాలేంటో ఈ కథనం చదివి తెలుసుకుందాం.
ఈ లక్షణాలు ఉంటే అది గుండెపోటే :
గుండెనొప్పి లక్షణాలు మొదలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. గుండె మధ్య భాగంలో చాలా బరువుగా ఉండటంతో పాటు చాతి మీద ఏదో బరువు పెట్టినట్లు మీరు ఫీలవుతారు. విపరీతమైన చెమట రావడంతో పాటు ఎడమ చెయ్యి, భుజం ఎడమ వైపునకు మెడ లాగుతుంటుంది. ఇకపోతే ఈ క్రమంలోనే కొందరికి విరేచనాలు అవుతుంటాయి. మరికొందరికి వాంతులు అవుతుంటాయి. ఎడమ వైపు దవడ పట్టేసినట్లు అవతుంది.
చాతి మధ్య భాగం నుంచి నిలువుగా గడ్డం వరకు కూడా పెయిన్ ఉంటుంది. కొందరికి అయితే చాతి మొత్తం పెయిన్ ఉంటుంది. కొందరు అయితే గుండె నొప్పి వచ్చినట్లు తెలుసుకుని అక్కడే స్పృహ తప్పి పడిపోతారు. ఇకపోతే గ్యాస్ నొప్ప లక్షణాలు ఇలా ఉంటాయి. చాతిలో లెఫ్ట్ సైడ్ పెయిన్ ఉండటంతో పాటు కడుపు ఉబ్బరంగా ఉంటుంది. పుల్లటి బేవులు వస్తుంటాయి. కడపుతో పాటు గుండెలోనూ మంటగా ఉంటుంది. ఇవి సాధారణంగా గ్యాస్ నొప్పి లక్షణాలు.

అయితే, ఒక్కోసారి గ్యాస్ నొప్పి లక్షణాలు అనుకుని మీరు నిర్లక్ష్యం వహించే చాన్సెస్ కూడా ఉంటాయి. అందుకే మీరు ఏ మాత్రం అజాగ్రత్త వహించకుండా ముందుగానే పరీక్షలు చేయించుకోవడం మంచిది. సమస్య రాక మునుపే జాగ్రత్త పడితే మీ ప్రాణాలు దక్కుతాయన్న సంగతి గుర్తెరగాలి. అయితే, సాధరణంగా జనంలో గ్యాసు నొప్ప వచ్చినా హార్ట్ అటాక్ ఏమో అనుకుని భయపడే వారు చాలా మందే ఉన్నారు.
కూర్చున్న వాడు కూర్చున్న చోటునే గుండెనొప్పి వచ్చి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు బోలెడు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. గ్యాస్ నొప్పికి, గుండె నొప్పికి మధ్య గల తేడాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇకపోతే గుండెనొప్పికి దారితీసే పరిస్థితులపైన మనం అంచనా వేసుకోవడం కూడా చాలా ముఖ్యం. కడుపులో మంట, అజీర్తి, గ్యాస్, ఆకలి లేకపోవడం విరేచనాలు, వికారంగా ఉండటం వంటి లక్షణాలు కూడా గుండె, ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయి.
గ్యాస్ నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు :
ఈ క్రమంలోనే అప్రమత్తత అవసరం. ఏ మాత్రం ఏమరపాటుగా వ్యవహరించినా మీకే ఇబ్బంది తలెత్తుతుంది. ఇకపోతే గుండె నొప్పి వచ్చిందనే భయం చాలు ఆటోమేటిక్‌గా ఇతర బాధలు వచ్చేస్తాయి. గుండె నొప్పి క్రమంగా భుజాలు, చేతులు, మెదడు, దవడలోకి వ్యాపించినట్లవుతుంది. ఊపరి అందనట్లు అవుతుంది. భయంతో చెమటలు పట్టేస్తుంటాయి. కాబట్టి ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా కూడా మీరు జాగ్రత్త వహించాలి. గ్యాసు నొప్పిని సైతం ఎమర్జెన్సీగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటి మధ్య తేడాను నిశితంగా పరిశీలించడం ఒక్కోసారి సాధ్యం కాదు.
గ్యాస్ నొప్పి రావడానికి సాధారణ కారణం ఆహారం డైజెస్ట్ కాకపోవడమే అని తెలుస్తోంది. కష్టమైన ఆహార పదార్థాలు, పుల్లటి పదార్థాలు, ఊరగాయలు, మసాలాలు తీసుకున్నపుడు వాటిని తట్టుకుని అరిగించుకోగల శక్తి ఉండాలి. అది లేనపుడే గ్యాస్ నొప్పి వస్తుంటుంది. యువకులు రాళ్లు తిని అయినా వాటిని అరిగించుకోగలరు మేం అలా చేయలేం అని పెద్దలు చెప్తుండటం మనం చూడొచ్చు. వారి చెప్పిన దాని ప్రకారంగా.. అరిగించుకునే శక్తి అనేది చాలా ముఖ్యమని ప్రతీ ఒక్కరు గ్రహించాలి. పుల్లటి పదార్థాలు కూడా ఎక్కువ తీసుకుంటే గ్యాస్ నొప్పి వచ్చే చాన్సెస్ ఉంటాయి.
గ్యాస్ నొప్పికి మందులు వాడొద్దు :
ఇకపోతే ఈ నొప్పి కాస్తా గుండె వరకు వెళ్లొచ్చు. ఈసోఫేగస్ అనే గుండె, ఊపిరితిత్తుల దగ్గర ఉండే అవయవంలో మంట వచ్చినట్లయితే చాలా డేంజర్. అక్కడ మంట రావడాన్ని హార్ట్ బర్న్ (Heart Burning) అంటుంటారు. అక్కడ మంట వచ్చినపుడు దానిని కనుక అశ్రద్ధ చేస్తే అది చివరకు గుండెనొప్పికి దారి తీస్తుంది. కాబట్టి కడుపు లేదా చాతి ఇతర భాగాల్లో మంట వచ్చిందంటే చాలు అప్రమత్తంగా వ్యవహరించాలి. గ్యాస్ నొప్పిని కంట్రోల్ చేసుకునేందుకుగాను మందులు వాడే బదులు సహజ సిద్ధంగా కొన్ని పద్ధతులు పాటించాలి. అవేంటంటే.. ప్రశాంతంగా వాకింగ్ చేయడం అలవర్చుకోవాలి.
ఇకపోతే అపానవాయువు వచ్చినపుడు దానిని వదిలేయాలి తప్ప అసలు ఆపుకునేందుకు ప్రయత్నించొద్దు. అలా చేయడం వల్ల మీ ఆరోగ్యానికే ప్రమాదం ఏర్పడుతుంది. ఇటీవల కాలంలో జంక్ ఫుడ్ తినేందుకు జనం బాగా అలవాటు పడుతున్నారు. కానీ దాని వల్ల ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఈ క్రమంలో జంక్ ఫుడ్ తినయడం మానేస్తేనే చాలా మంచిది. ఎందుకంటే అది తినడం వల్ల డైజేషన్ సరిగా కాదు. దాంతో మీరు మళ్లీ ఇంకా వేరే ఇబ్బందులను కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అరిగే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది.