Dry Ginger Powder : సర్వ రోగ నివారిణి శొంఠి.. శొంఠిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. పచ్చి అల్లాన్ని సున్నపు నీళ్లలో మరియు పాలల్లో మరొక పెట్టి ఎండబెట్టి నా అల్లాన్ని శొంఠి అంటారు. దీనిని మహా ఔషధం అంటారు. శొంఠి పొడిని డైరెక్టుగా ఎప్పుడు తీసుకోకూడదు. చిన్నపిల్లలకు పాలలో శొంఠి పొడి వేసి (Dry Ginger health benefits) మరిగించి ఇస్తే జలుబు, ముక్కు పట్టడం, దగ్గు అంతేకాకుండా గొంతు నొప్పి, కపాలం వాతం పైత్యం వంటి వాటిని చక్కగా తగ్గిస్తుంది. శొంఠి పొడి, ధనియాలు బరకగా దంచి నీళ్లలో వేసి కలిపి తాగడం వల్ల జ్వరం ఇట్లే తగ్గిపోతుంది.
శొంఠి బాగా అరగదీసి ఆ గంధాన్ని రెండు కళ్ళల్లో పెట్టుకుంటే జలుబు నుండి తగ్గిస్తుంది. కళ్ళలో మలిన పదార్థాలు బయటికి వచ్చి కళ్ళు శుభ్రపడతాయి. కడుపులో ఉన్న నులిపురుగులను నివారణకు శొంఠి పొడి రోజు ఆహార పదార్థాలలో వాడాలి. శరీరంలో ఏర్పడిన కొవ్వు మరియు ఉబకాయ సమస్యలను తగ్గిస్తుంది. ప్రతిరోజు భోజనం ముద్దలో శొంఠి పొడి కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అజీర్తి పోయి ఆకలి అనేది పెరుగుతుంది. శొంఠి పొడిని నీళ్లలో మరిగించి పరిగడుపున అర టీ స్పూన్ తేనెతో కలిపి తాగడం వల్ల కొలెస్ట్రాల్ ఇట్లే తగ్గిపోతుంది.

Dry Ginger Powder : శొంఠి పొడితో ఆరోగ్య ప్రయోజనాలివే..
బరువు కూడా అదుపులోకి వస్తుంది. శొంఠి పొడిని పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల శరీరంపై వచ్చే ఎలర్జీ వల్ల వచ్చే దద్దులు, బెందులు ,దురద తగ్గుతాయి.శొంఠి కండరాల నొప్పిని తగ్గిస్తుంది. అండాశయ పేగుల్లో వచ్చే క్యాన్సర్ ను తగ్గించే లక్షణాలు శొంఠి లో ఎక్కువగా ఉన్నాయి. శొంఠి శరీరంలో క్యాన్సర్ కణాలను వృద్ధిని నిరోధిస్తుంది. క్యాన్సర్ రాకుండా మన శరీరాన్ని రక్షించడానికి ఎంతగానో సహాయపడుతుంది. శొంఠి పొడిని నీళ్లతో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లు కూడా వెంటనే తగ్గిపోతాయి.

శొంఠి పొడి ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక టీ స్పూన్ నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల అరుగుదల తగ్గడం అజీర్ణ సమస్య తగ్గుతాయి. అలాగే విరోచనాలు, నీళ్ల విరోచనాలు శొంఠి పొడిని ఒక గ్లాస్ నీళ్లతో కలిపి ఔషధంగా వాడితే ఉపశమనం పొందవచ్చు. శొంఠి ఉదర సమస్యలను, కడుపు ఉబ్బరంగా వంటి సమస్యలను తగ్గిస్తుంది. శొంఠి నీళ్లతో అరగదీసి కనతలకు, తలకు పట్టించడం వల్ల భరించలేని తలనొప్పి వెంటనే తగ్గుతుంది అలాగే మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు శొంఠి పొడిని తాటి బెల్లం కలిపి తీసుకుంటే ఉపశమనం పొందుతారు.