Digestion Problem Solution : డైజేషన్ ప్రాబ్లమ్ వేధిస్తుందా..? ఇలా చేయండి.. బెటర్ రిజల్ట్ కనిపిస్తుంది..

Digestion Problem Solution : ఆహారం ఎక్కువగా తింటే ఇబ్బందులు తప్పవు. అలాగని తక్కువ తిన్నా కష్టమే.. డైజేషన్ ప్రాబ్లమ్స్‌సే అందుకు కారణం. తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అయితే ఇబ్బందులేమీ ఉండవు. కానీ ప్రస్తుతం కాలంలో సమయానికి ఆహారం తీసుకోకపోవడం, టైం కానీ టైంలో తినడం వల్ల ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. వీటి వల్లే ఎసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరంతో పాటు గుండెల్లో మంట, మలబద్దకం వంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. వీటిని ఎదుర్కొనేందుకు పలు ఐటమ్స్‌ను ఆహరంతో పాటు తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

సెలరీ… దీనిని ఆహారంగా తీసుకుంటే గ్యా్స్, ఎసిటిటీ, పొత్త కడుపులో నొప్పితో పాటు వాంతుల సమస్యల నుంచి బయటపడొచ్చు. ఇందులో ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉండటం వల్ల మేలు చేకూరుతుంది. డైజేషన్ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడేవారు సెలెరీ, నల్లఉప్పు, అల్లంను మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని భోజనం చేశాక తింటే ఫలితం ఉంటుంది. డైజేషన్ సిస్టమ్‌లోని మజిల్స్‌ను కదిలించే చాలా యాంటీ బ్యాక్టీరియల్స్‌ను పుదీన టీ అందజేస్తుంది. మలబద్దకం తదితర సమస్యలను ఇది దూరం చేస్తుంది.

digestion problem home remedy in telugu
digestion problem home remedy in telugu

ఇక దాదాపుగా చాలా మందికి భోజనం చివర్లో పెరుగు తింటే గానీ భోజనం చేసిన ఫీలింగ్ ఉండదు. కడుపు సంబంధిత ప్రాబ్లమ్స్‌కు పెరుగుతో చెక్ పెట్టొచ్చు. ప్రతి రోజూ ఫ్రెష్ పెరుగు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇక పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్రావనాన్ని నియంత్రించడంలో తోడ్పడుతుంది. ఫలితంగా కడుపు మంట నుంచి రిలీఫ్ లభిస్తుంది. పుచ్చకాయతో ఆరోగ్యానికి ఎంతో లాభం. ఇందులో నీరు పుష్కలంగా ఉండటం, ఖనిజాలు ఎక్కువగా ఉండటం వల్ల కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్‌కు చెక్ పెట్టొచ్చు. తిన్న తర్వాత నిద్రపోవడం మంచి అలవాటు కాదు. అలా చేస్తే బరువు పెరిగే ప్రమాదముంది. భోజనం చేశాక వ్యాయామం లాంటివి చేయకుండా 15 నిమిషాలు నడిస్తే ఎంతో ఉపయోగకరం.

Read Also : Breathing Problems : బ్రీతింగ్ ప్రాబ్లమ్ వేధిస్తుందా..? చిన్నపిల్లలు, పెద్దవారిలో శ్వాస రేటు ఎంత ఉండాలంటే..!

Leave a Comment