Diabetes Patients Alert : డయాబెటిక్ తో బాధపడే వారు ఆ విషయం తెలిసిన తర్వాత ఎంత ఇష్టమైనా సరే స్వీట్లు తినడం తగ్గిస్తారు. కానీ ఒక్కసారిగా స్వీట్లు తినడం ఆపేస్తే మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలా చేయడం వలన మొదటికే మోసం వస్తుందట. మన శరీరంలోకి రోజూ వారీగా వెళ్లే షుగర్ కంటెంట్ వెళ్లకపోతే చాలా సమస్యలు వస్తాయని డాక్టర్లు సూచిస్తున్నారు. మిగతా పోషకాలు ఎంత అవసరమో చెక్కెర పదార్థాలు కూడా అంతే అవసరం.
మనం గనుక ఒకేసారి చెక్కరను బంద్ చేస్తే చాలా ప్రాబ్ల్సం వస్తాయి. చెక్కరల్లో సహజ చెక్కరలు కూడా ఉంటాయి. సహజ చెక్కరలు మన శరీరానికి చాలా అవసరం. ఇవి మన శరీరంలోకి పోయి శక్తి సామర్థ్యాలను పెంపొందించడంలో సహాయపడతాయి. మనలో కొంత మంది డ్రగ్స్ కు అలవాటు పడతారు. వారు ఒక్కసారిగా డ్రగ్స్ మానేస్తే వాళ్ల శరీరం ఎలా రియాక్ట్ అవుతుందో.. మనం షుగర్ మానేసినా కూడా మన బాడీ అలాగే రియాక్ట్ అవుతుంది.

ఇలా ఒక్కసారిగా షుగర్ మానేయడం మంచిది కాదని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఇలా చేయడం వలన అలసట, తలనొప్పి, మెడ తిమ్మిర్లు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయట. అంతే కాకుండా కడుపుపై కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మనకు గుడ్ ఫీల్ నిచ్చే హార్మోన్స్ చెక్కరలనుంచే రిలీజ్ అవుతాయి. కావున మనం చెక్కరలను తీసుకోవడం చాలా అవసరం. మీరు ఒకేసారి చెక్కరను మానేస్తే ముందు మీలో చికాకు మొదలవుతుంది. అటు తర్వాత మెల్లగా తలనొప్పి ప్రారంభం అవుతుంది.
Read Also : Diabetes: ఇలాంటి విత్తనాలు తిన్నారంటే.. జీవితంలో షుగర్ రానేరాదు!