Diabetes Control Tips : మన దేశంలో ఎక్కువ మంది రెండు పూటలు అన్నం తింటుంటారు. తెల్ల బియ్యంతో వండిన అన్నంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది. అన్నం వల్ల కడుపునిండుతుందే తప్ప శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. పాలిష్ బియ్యంను తినడం వల్ల స్థూలకాయం వచ్చే చాన్స్ ఉంది. టైప్ 2 డయాబెటిస్ సైతం వస్తుంది. ప్రపంచంలో చైనా తర్వాత ఎక్కువ మంది డయాబెటిస్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతున్న వారు మన దేశంలోనే ఉన్నారు.

కరోనా బారిన పడిన వారిలోనూ డయాబెటిస్ వస్తుంది ఓ అధ్యయనంలో తేలింది. డయాబెటిస్ బాధలు దరిచేరకుండా ఉండాలంటే మనం రోజు తినే ఆహారంలో వైట్ రైస్‌కు ప్రత్యామ్నాయ దాలియా, బార్లీ, ఓట్స్, బ్రకోలీ, క్యాబేజి, బ్రౌన్ రైస్ వంటివి తీసుకోవాలి. డాలియా (గోధుమ రవ్వ) మంచి టేస్టుతో ఉంటుంది. దీనితో సూప్, కిచిడీ లేదా ఉప్మా వంటివి చేసుకోవచ్చు. వీటి వల్ల శరీరానికి మాంగనీస్, మెగ్నీషియం, తదితర విటమిన్స్ అందుతాయి. బార్లీ సైతం రుచిగానే ఉంటుంది. ఇవి ఓట్స్ మాదిరిగా ఉంటాయి. అరకప్పు బార్లీలో సుమారు 91 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.
బీటా-కెరోటిన్, విటమిన్ ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ వీటిలో లభిస్తాయి. ఇక క్యాలీఫ్లవర్ తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో లాభం కలుగుతుంది. ఇందులో విటమిన్ సి, మాంగనీస్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. క్యాబేజిలోనూ విటమిన్ సి, కె, ఫైబర్ వంటివి ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల లాభం కలుగుతుంది. వీటితో పాటు బ్రకోలీ సైతం మన బాడీకి ఎంతో మేలు చేస్తుంది. ఇలాంటి పదార్థాలను మనం ఆహారంలో భాగంగా చేసుకుంటే డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా తక్కువేనట. మరి వీటిని మీ ఆహారంలో చేర్చుకుని బాడీకి అవసరమైన పోషకాలను పొందండి. ఆరోగ్యంగా ఉండండి.