Death Symptoms : సాధారణంగా ఒక వ్యక్తి చావుకు దగ్గర అవుతున్న కొద్దీ ఆయనలో కొన్ని మార్పులు సంభవిస్తుంటాయి. ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాడు. బాడీలో శక్తి తగ్గిపోతుంది. మెటాబాలిజం సరిగా పనిచేయదు. అలసట పెరిగిపోతుంది. చిన్న వాటికే అవస్థలు పడుతుంటారు. అతిగా నిద్ర పోతుంటారు. అయితే, అతి నిద్ర అనేది చావుకు ఒక సంకేతమట.. అందుకే వీలైనంత మేర యాక్టివ్ గా ఉండేందుకు ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు.
అందరికీ దూరంగా.. చావు దగ్గరైనపుడు మనం క్రమంగా అందరికీ దూరం అవుతామట..ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టాన్ని చూపిస్తాము. నేను చనిపోయినా నాతో ఎవరూ రారు.. నన్ను ఎవరూ పట్టించుకోరు. అలాంటప్పుడు అందరితో కలిసి ఉండి చేసేది ఏముందనే భావన మనలో వస్తుందని తెలిసింది.

ఆహారానికి సరిగా తీసుకోకపోవడం.. మరణం సమీపిస్తున్న కొద్దీ ఏమీ తినాలనిపించదు. ఏదీ తాగాలని కూడా ఉండదు. దీంతో శరీరంలో శక్తి క్రమంగా తగ్గుతుంది. కొన్ని రోజులు ఏమీ తినకపోయినా అవస్థ పడుతూ ఎలాగోలా రోజులు గడిపేస్తారు. అయితే, ఇలాంటి టైంలోనే ఏదో ఒకటి తింటూనే ఉండాలని, పెదాలలో తడి అనేది తగ్గకుండా చూసుకోవాలట.. మరణానికి దగ్గర అయిన వ్యక్తుల్లో అధికరక్తపోటు, శ్వాస తీసుకోవడం ఇబ్బందులు ఏర్పడతాయి. గుండె కొట్టుకోవడంతో పాటు మూత్రపిండాలు సరిగాపనిచేయవు.
శరీరంలో రక్త ప్రసరణ ఆగిపోతుంది. చేతులు, కాళ్లు సరిగా పనిచేయవు. చర్మం మొత్తం పాలిపోతుంది. బాడీలోని వేడి శాతం క్రమంగా తగ్గి మొత్తం చల్లబడిపోతుంది. ఆ సమయంలో మన ఆలోచనలు గందరగోళంగా ఉంటాయి. గుర్తుపట్టే శక్తి తగ్గిపోతుంది. మెదడు సరిగా పనిచేయదు. అంతేకాకుండా శరీరం మొత్తం పెయిన్ ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది.
Read Also : Avisa Seeds Health Benefits : అవిసె మొక్క.. ఎన్ని జబ్బులను మాయం చేస్తుందో తెలిస్తే అసలే వదిలిపెట్టరు!