Dates Health Benefits : 100 రోగాలను పోగొట్టే ఖర్జూర.. ఎండాకాలంలో మండే ఎండలు సీజన్ ఫ్రూట్తీపిగా ఉండే ఖర్జూరాలు… ఆరోగ్యం, అందం ఖర్జూరతో మీ సొంతం.. ఖర్జూరం ప్రత్యేకతలు.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ప్రోటీన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం,కాపర్, కార్బోహైడ్రేస్, (పాసరైజ్) విటమిన్స్ (b1, b2 ) పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఖర్చులలో కొవ్వు పదార్థాలు ఉండవు. వృద్ధులైతే తాజా ఖర్జూర అరుగుదల ఉండదు కనుక ఎండు ఖర్జూరాలను 5 ,10 నీళ్లలో రాత్రంతా నానబెట్టి నీళ్లు, ఖర్జూర పరిగడుపున తీసుకోవాలి. మంచి ఫలితాలు ఉంటాయి. ఖర్జూరం కంటి సమస్యలను నివారిస్తుంది చూపుని మెరుగుపరుస్తుంది. ఖర్జూరం లో ఉండే పోషకాలు శరీరానికి కావలసిన తేమను అందిస్తాయి. కాబట్టి చర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుంది.
చర్మం పొడిబారకుండా తాజాగా ఉంచుతుంది. బరువు పెరగాలనుకునే వారికి చక్కటి ఔషధం.. ఖర్జూరాన్ని మితంగా తీసుకోవాలి. అధికంగా తింటే అజిత్ సమస్య వస్తుంది. ఖర్జూరాలు తిన్న వెంటనే అన్నం తినకూడదు. నిద్ర సమస్యతో బాధపడేవారు ఖర్జూరం, పాలలో నానబెట్టి తినడం వల్ల చక్కటి నిద్ర ఉంటుంది. మలబద్ధకం సమస్య తగ్గాలంటే ఎండు ఖర్జూరాలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఏదైనా పండు జామకాయ కలిపి తింటే ఈ సమస్య నుండి నెమ్మది నెమ్మదిగా విముక్తి పొందుతారు. పంచదార తినడం వల్ల చాలా సమస్యలు వస్తుంటాయి.. కాబట్టి ఖర్జూరాలతో ఇంట్లోనే సిరప్ తయారు చేసుకోవచ్చు (బ్రెడ్డు) (సలాడ్స్) వీటిపై వేసుకోవచ్చు. పావు కేజీ ఎండు ఖర్జూరాలు గింజలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేడి బాగా మరిగే నీళ్లు (30 నిమిషాల పాటు) నానబెట్టుకోవాలి.

Dates Health Benefits : ఖర్జూర తింటే శరీరంలో కలిగే అద్భుతమైన మార్పులివే..
చల్లారిన తర్వాత వడకట్టి గాజు సీసాలో నిల్వ చేసుకోవచ్చు. పంచదార బదులు వాడుకోవచ్చు. వేసవిలో (డ్రిఐటేషన్) నీరసం.. తాజా ఖర్జూరాలు వేడినీళ్లలో శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లో మెత్తగా గ్రైండ్ చేయాలి అరటి పండును మెత్తగా చేసి తేనె, దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి,వెనీలా పొడి వీటన్నిటిని కలిపి తీసుకోవడం వల్ల (డ్రిలైజేషన్) ఉండదు.. ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది పిల్లలలో ఖర్జూరం తేనె కలిపి ఇవ్వడం వలన బలహీనత తగ్గుతుంది. ఖర్జూరాలు తినడం వలన పిల్లలు ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది…రక్తహీనత, ఇనుము తగ్గడం సమస్య గర్భిణీ స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది ఖర్జూర తీసుకుంటే ఎండు ఖర్జూరాలను3 4 అరకప్పు నీళ్లలో నానబెట్టుకొని ఉదయాన్నే నీళ్లను, ఖర్జూరాలను తీసుకోండి మంచి ఫలితం ఉంటుంది.
బాలింతలకు పాలు తగ్గినప్పుడు తాజా ఖర్జూరాలను3 4 పాలతో కలిపి తరచూ తీసుకోవడం వల్ల పాలు పుష్కలంగా వస్తాయి. ఇనుము తగ్గడం వల్ల నెలసరి సమస్యలు ఉంటాయి. ఖర్జూర తేనె కలిపి తీసుకుంటే ఆ సమస్య ఉండదు. రోజూ 3 ఖర్జూరాలు తింటే.. గుండెపోటు వల్ల గుండె సమస్యలు ఉండవు..శక్తిహీనత, ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఖర్జూరం మేక పాలలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ( ఆవు పాలు) కలిపి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. జలుబు దగ్గు తరచు వచ్చే వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. అధిక రక్తపోటు గుండెపోటు సమస్యల నివారణకు ఖర్జూరాలు ఐదు కరివేపాకు రెండు రెమ్మలు తీసుకొని మిక్సీ జార్లో జ్యూస్ లా తయారు చేసుకొని తాగితే ఆ సమస్యల నుండి బయటపడవచ్చు.

వేసవికాలం చిన్నపిల్లలకు (డిఆర్డినేషన్) ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖర్జూరాలు నీళ్లలో వేసి మరిగించి తాగించడం వల్ల ఆ సమస్య ఉండదు. అలాగే ఖర్జూరం నీళ్లు తాగితే నీళ్ల విరోచనాలు సమస్య కూడా తగ్గుతుంది. ఎనర్జీ తక్కువగా ఉన్న వాళ్ళు ఎనర్జీ డ్రింక్…15 ఎండు ఖర్జూరాలు మెత్తగా గ్రైండ్ చేసి పాలు తేనె కలిపి సువాసన కోసం కొంచెం యాలుకలు పొడి కలపాలి తాగడం వల్ల ఎనర్జీ గా ఉంటారు. ముఖ సౌందర్యం కోసం.. ఖర్జూరాలను రాత్రంతా పాలల్లో నానబెట్టి ఖర్జూర ముక్కల్లో మీగడ, నిమ్మరసం పేస్టు లా చేసి ముఖంపై అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుక్కోండి వారానికి రెండు సార్లు ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది..
Read Also : Digestion Problem Solution : డైజేషన్ ప్రాబ్లమ్ వేధిస్తుందా..? ఇలా చేయండి.. బెటర్ రిజల్ట్ కనిపిస్తుంది..