Curry Leaves Juice Benefits : చాలా మంది కూరలో కరివేపాకు వస్తే చాలు.. అది ఎందుకు తినడం అని బయట పడేస్తుంటారు. లేదా పక్కన పెట్టేస్తుంటారు. అయితే, కరివేపాకులో ఉండే పోషకాల గురించి తెలిసిన వారు అయితే అస్సలు అలా చేయబోరు. కరివేపాకులో ఉండే పోషకాలు మానవుడికి చాలా కావల్సినవి. (Curry Leaves ) కరివేపాకును ప్రతీ ఒక్కరు కంపల్సరీగా తీసుకోవాలని పెద్దలు, ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వారు కంపల్సరీగా కరివేపాకును తీసుకోవాలి.
అయితే, యాజ్ ఇట్ ఈజ్‌గా కాకుండా కరివేపాకును జ్యూస్ లాగా కూడా చేసుకుని తాగొచ్చు. చాలా మంది ఇటీవల కాలంలో చిన్న ఏజ్‌లోనే రక్త పోటు సమస్యతో సతమతమవుతున్నారు. హై బ్లడ్ ప్రెషర్‌తో బాధపడుతున్నారు. అయితే,(High blood pressure) బ్లడ్ ప్రెషర్ హై అయినా లో అయినా.. ఏదైనా ప్రమాదమే.. సమతుల్యంగా ఉండాలి. అలా అయితేనే మనిషి ఆరోగ్యంగా ఉండగలడు. అలా మనిషిని హెల్దీగా ఉంచడంలో కరివేపాకు (Curry Leaves Juice) చక్కటి పాత్ర పోషిస్తుంది. కరివేపాకు జ్యూస్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన చక్కటి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Curry Leaves Juice Benefits : బీపీ సమస్యకు కరివేపాకు జ్యూస్‌తో చెక్..
ప్రతీ రోజు ఉదయం పరగడుపున నాలుగు లేదా కరివేపాకులను పచ్చివి మంచిగా కడిగి నమిలినా మంచిదేనని నిపుణులు చెప్తున్నారు. అలా చేయడం వలన (BP Control) బీపీ కంట్రోల్‌లోకి వస్తుంది. కరివేపాకుతో ఆరోగ్యంతో పాటు టేస్ట్ కూడా వస్తుంది. చారులోనో ఇతర ఏదేని కూరలలో కరివేపాకులను కలిపి తీసుకునే సంగతి మనకు తెలిసిందే.
కరివేపాకు తినడం వలన అనేక రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది. హ్యూమన్ బాడీకి కావాల్సిన గ్లూకోజ్ లెవల్స్ అందించడంలోనూ (Curry Leaves Juice Benefits )కరివేపాకు సాయపడుతుంది. కరివేపాకుల నీటిని తీసుకోవడం వలన కూడా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్‌లోకి వస్తుంది. ఇందుకుగాను మీరు చాలా సింపుల్‌గా కరివేపాకులను నీటిలో ఉడకబెట్టి.. ఆ తర్వాత వాటర్ చల్లారినాక తీసుకోవచ్చు.
Read Also : Pomegranate Benefits : దానిమ్మతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్… ఇక అస్సలు దానిమ్మను వదలరు..