Breastfeeding Milk : తల్లిపాలు పిల్లలకు అన్ని రకాలుగా శ్రేయస్కరం. శిశువు హెల్దీగా ఉంటేందుకు తల్లి పాలు ఎంతో ఉపయోగకరం. ఈ పాలలో పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలకు ఆరోగ్యం చేకూరుతుంది. అంతే కాకుండా తల్లి, బిడ్డకు మధ్య మంచి ప్రేమను, బంధాన్ని పెరిగేలా చేస్తుంది. పిల్లలకు ఐదేళ్లు వచ్చే వరకు తల్లిపాలు పడిగే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు డాక్టర్లు. శిశువులు ఎన్ని రోజులు తాగితే అన్ని రోజులు.. లేదంటే తల్లి ఎన్ని రోజులు పాలు ఇవ్వగలిగితే అన్ని రోజులు పాలి పట్టించాలని నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది.
అయితే శిశువుకు పుట్టిన ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలి. వేరే ఇతర ఘన, ద్రవ పదార్థాలు ఇవ్వొద్దు. తల్లిపాలు వల్ల శిశువుకు ఇన్‌ఫెక్షన్స్ నుంచి వాంతులు, డయేరియా నుంచి రక్షణ కలుగుతుంది. తల్లిపాలు తగడం వల్ల పిల్లలు పెద్దయ్యాక ఇతర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. పిల్లలకు పాలు పట్టడం ద్వారా తల్లికి రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వంటి ముప్పు తక్కువగా ఉంటుంది.

రెండు సంవత్సరాలు లేదా అంతకు మించి ఎక్కువగా వయస్సు వచ్చే వరకు పిల్లలకు తల్లి పాలు ఇవ్వాలని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. రెండేళ్ల తరువాత సైతం తల్లిపాలు పట్టించడం వల్ల శిశువుకు పోషకాలు అదనంగా అందుతాయని చెప్పలేమని పలువురు డాక్టర్లు చెబుతున్నారు. పిల్లలుకు ఆరు నెలల వయస్సు దాటాకా పిల్లలకు ఇతర ఆహారాలు అందించవచ్చు. అది కూడా డాక్టర్ ను సంప్రదించి వారి నిర్ణయం తీసుకున్న తర్వాతే. బ్రిటన్ దేశంలో శిశువు పుట్టిన తర్వాత సుమారు 80 శాతం మేర తల్లులు కొన్ని వారాల వరకు మాత్రమే పాలు ఇస్తారట. ఆ తర్వాత ఇవ్వడం మానేస్తారట.
Read Also : Control Blood Sugar : మీకు షుగర్ ఉందా.. ఆ సమయంలో వీటి జోలికి అసలే వెళ్లొద్దు..!