Black Pepper Health Tips : మనం వంటింట్లో వాడుకునే మిరియాలలో మంచి ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని కేవలం మసాలా, వంటల్లోనే కాకుండా ఆరోగ్యానికి మెడిసిన్‌లా కూడా ఉపయోగపడుతాయి. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. మిరియాల వలన ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆకలి పెరుగుతుంది :
మిరియాల వలన ఆకలి బాగా పెరుగుతుంది. అందుకోసం ఒక చెంచాడు బెల్లంలో అర టేబుట్ స్పూన్ మిరియాల పొడి కలిసి తీసుకుంటే చాలు. సమయానికి ఆకలి అవుతుంది. మిరియాలలో విటమిన్ సి, విటమిన్ ఏ, కెరోటిన్ వంటి గుణాలు ఉంటాయి. వీరి మానవ శరీరానికి హానికలిగించే ఫ్రీరాడికల్స్‌ను తొలగించడమే కాకుండా, కాన్సర్ కణాల పెరుగుదలను కూడా నిరోధిస్తాయి. అంతేకాకుండా ఆందోళన, ఒత్తిడి దూరం చేసుకోవాలంటే మిరియాల పాలు తాగాలి.
దీంతో జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. మిరియాలు వలన గ్యాస్ట్రిక్, మలబద్ధకం, విరేచనాలు వంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. సాధారణంగా మనకు జలుబు, పడిశం, దగ్గు వంటివి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మిరియాల పాలు తాగితే వెంటనే క్యూర్ అవుతుంది. అన్ని రోగాల నివారణకు మిరియాలు మంచి క్యూర్‌గా పనిచేస్తాయి.
మిరియాలు.. అసలైనవో కావో ఎలా కనుక్కోవాలంటే? :
సాధారణంగా వంటింట్లో ఉండే మిరియాల్లో అసలైనవి, నకిలీవి ఏవో మనం గుర్తించలేము. అవసరాన్ని బట్టి వంటల్లో, హెల్త్ టిప్స్ కోసం మిరియాలను ఉపయోగిస్తుంటాం. ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో అన్ని వస్తువులు కల్తీ అవుతున్నాయని మనకు తెలిసిందే. పసుపు, కారం, ఉప్పు, పప్పులు, నూనెలు ఇలా అన్నీ నకిలీవి మార్కెట్లో కనిపిస్తుంటాయి. అయితే, చూసేందుకు అసలు వాటిలాగే కనిపిస్తాయి.దీంతో మనం మోసపోతుంటాం.. లేదా నకలీవి వాడి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటాం. కాగా, ఒరిజినల్, నకిలీ మిరియాలను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం..
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (fassai) ఇటీవల ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో మంచి మిరియాలను ఎలా గుర్తించాలో పేర్కొంది. నకిలీ మిరియాలను ‘బ్లాక్ బెర్రీస్’తో కల్తీ చేయొచ్చని తెలిపింది. అసలు మిరియాలు, నకిలీ మిరియాలను టేబుల్ పై ఉంచి వేళ్లతో గట్టిగా నొక్కాలి. అందులో ఏవి అయితే పగిలిపోతాయో అవి నకిలీవి అని నిర్దారించారు. పగలనివి మంచి మిరియాలుగా వెల్లడించారు. అసలు సిసలు మిరియాలు చాలా గట్టిగా ఉంటాయని, వేళ్లతో నొక్కితే పగిలిపోవని వీడియోలో పేర్కొన్నారు.
Read Also : Summer Health Tips : చంకల నుంచి వచ్చే దుర్వాసనతో తట్టుకోలేకపోతున్నారా.. ఇలా చేస్తే బెటర్‌గా ఫీలవుతారు..