Summer Health Tips : కొందరి శరీరం నుంచి విపరీతంగా దుర్వాసన వస్తుంటుంది. ఇలాంటి వ్యక్తులు నలుగురి మధ్యలో ఉండేందుకు తెగ ఇబ్బంది పడుతుంటారు. చంకల కింద చెమట రావడం, దురదతో పాటు విపరీతమైన దుర్వాసన వెదజల్లడం వలన వారు తెగ ఇబ్బందిగా ఫీలవుతుంటారు. సమ్మర్‌లో చెమటతో పాటు దురదలు రావడం కామన్. అయితే, మరొకొందరిలో సీజన్‌తో సంబంధం లేకుండా శరీరం మొత్తం తడిసిపోయి చెమట కంపు కొడుతుంటుంది. అలాంటి వారు తమ బాడీ నుంచి వచ్చే దుర్గంధాని దూరం చేసుకోవడానికి ఎక్కువగా పౌడర్ యూస్ చేస్తుంటారు.కానీ అది కొంతసేపు మాత్రమే రిలీఫ్ ఇస్తుందని గుర్తించలేరు.
చెమట కంపుతో దూరం దూరం..

చంకల నుంచి దుర్వాసన రావడం వలన మన పక్కన కూర్చోవడానికి ఎవరూ ముందుకు రారు. బస్సులో కానీ, మెట్రోరైళ్లలో వెళ్లేటప్పుడు స్టాండింగ్ సమయంలో ఇటువంటి వ్యక్తుల పక్కన ఉన్నవారు తెగ ఇబ్బంది పడుతుంటారు. అయితే, కొందరు ఈ సమస్య పరిష్కారం కోసం ఏవేవో చేస్తుంటారు. డెర్మటాలజిస్టులను కూడా సంప్రదిస్తుంటారు. వీటన్నింటికంటే ఇంట్లోనే చక్కగా దీనికి పరిష్కారం కనుగొనవచ్చునని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
సాధారణంగా బాడీ ఓవర్ హీట్ అయిన సమయంలో చెమట వస్తుంది. ఈ చెమట వాటర్ రూపంలో ఉండటం వలన బ్యాక్టీరియాతో ఈజీగా కలిసిపోతుంది. దీని వల్లే దుర్వాసన వస్తుందట..ఈ చెమట కంపును పోగొట్టుకోవాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు.. 1/3 వంతు కొబ్బరినూనె, 1/4 వంతు బేకింగ్ సోడా, 1/4 వంతు- టోపికా ఫ్లోర్‌తో పాటు 3 నుంచి 4 చుక్కల శాండిల్ వుడ్ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకుని మొత్తం ఓ బౌల్‌లో వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజు రాసుకుంటే చంకల కింద నుంచి దుర్వాసన వెదజల్లడం ఆగిపోతుంది. పై వాటిలో ఏదైనా దొరకకపోతే ⅓ వంతు – ఆల్మండ్ ఆయిల్, ¼ వంతు – బేకింగ్ సోడా, ¼ వంతు – కార్న్ స్టార్చ్, 4 నుండి 5 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కూడా కలుపుకుని రాసుకోవచ్చు. స్నానం చేసే ముందు రోజ్ వాటర్ నీటిలో కలుపుకుని చేయాలి. చంకల కింద కూడా ఆప్లయ్ చేసుకుంటే చెమట కంపు నుంచి రిలీఫ్ పొందవచ్చును.
Read Also : Health Tips : ఇలాంటి ఆయుర్వేద చిట్కాలతో వృద్ధాప్యంలోనూ ఎముకలు దృఢంగా ఉంచుకోవచ్చు.. అవేంటో తెలుసా?