Health Tips : చాలా మందికి వృద్ధాప్యంలోకి రాగానే ఎముకలు విరిగిపోతుండటం మనం చూడొచ్చు. అయితే, ఇటీవల కాలంలో పిల్లలకు సైతం ఎముకలు పెళుసుగా మారుతున్నాయి. చిన్నపాటి దెబ్బకో లేదా ఒత్తిడి లేదా రాపిడి జరిగినప్పుడే బోన్స్ విరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఎముకలు దృఢంగా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాలు ఫాలో కావాలి. ఇవి ఫాలో అయితే వృద్ధాప్యంలోనూ ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి. ఎముకలు గుళ్ల బారకుండా దృఢంగా ఉండాలంటే ఈ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి.

సాధారణంగా ఎముకలు బలపడకపోవడానికి కారణం కాల్షియం లోపమే. రక్తంలో కాల్షియం స్థాయి తక్కువగా ఉన్నపుడు శరీరంలోని ఎముకలపై ఆ ఎఫెక్ట్ పడుతుంది. అలా ఎముకలు పెళుసుగా మారుతాయి.కాగా, బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండేందుకుగాను విటమిన్ డి, కాల్షియం చాలా అవసరం. ఇకపోతే ఎముకలు దృఢంగా ఉండాలంటే ప్రతీ ఒక్కరు ఈ పొడి తీసుకోవాలి. ఆ పొడి ఎలా తయారుచేసుకోవాలంటే..నువ్వులను వేయించి పొడిగా చేసుకుని ఆహారంలో భాగం చేసుకోవాలి.
Health Tips : వృద్ధాప్యంలోనూ ఎముకలు బలంగా ఉండాలంటే ఇలా చేయండి..
ఈ నువ్వుల పొడిని పాలలో లేదా నీళ్లలో కలిపి ప్రతీ రోజు తీసుకుంటే బోన్స్ హెల్త్‌కు చాలా మంచిది. ఒకవేళ నువ్వులు తీసుకోవడం నచ్చకపోతే బాదం పప్పులను తీసుకుంటే చాలా మంచిది. రాత్రిపూట బాదం పప్పును నానబెట్టి ఉదయాన్నే వాటి పొట్టును తీసేసి గోరువెచ్చని పాలలో వేసుకుని తీసుకుంటే మంచి ప్రయోజనముంటుంది.
నువ్వులు లేదా బాదంపప్పులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హ్యూమన్ బాడీలోని కాల్షియం పర్సంటేజ్ ఆటోమేటిక్‌గా పెరిగి బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. బాదం పప్పులో ఉండే కొవ్వులు, ఫైబర్, మెగ్నిషియం, విటమిన్ ఈ హ్యూమన్ బాడీ ప్లస్ బోన్స్‌కు చాలా కావల్సినవి. బాదం పప్పులను చాలా మంది ప్రతీ రోజు తీసుకుంటుండటం మనం చూడొచ్చు. నువ్వులు లేదా బాదంను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా వృద్ధాప్యంలోనూ ఎముకలు దృఢంగా ఉంటాయి.
Read Also : Warm Milk Benefits : నిద్రలేమి సమస్యకు గోరువెచ్చని పాలతో చెక్.. పడుకునే ముందు తాగితే హాయిగా నిద్రపోతారట..!