Benefits of Olive Oil : అనారోగ్యమా.. ప్రస్తుత కాలంలో ఈ సమస్య అనేది అందరికీ వస్తుంది. పెద్ద చిన్నా అనే తేడా లేకుండా అందరూ జబ్బుల బారిన పడుతున్నారు. ఇందుకు మన లైఫ్ స్టైలే కారణమని అనేక మంది వైద్యులు పేర్కొంటున్నారు. లైఫ్ స్టైల్ విధానాన్ని మార్చుకునేందుకు చాలా మంది ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇలా మనం అనేక రకాల జబ్బుల బారిన పడడానికి లైఫ్ స్టైల్ కాకుండా వేరే కారణం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. అదే మనం వాడే నూనె. నూనెతో కూడా మనకు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.
మనం వాడుతున్న నూనె విషయంలో అనేక మంది అపోహలు కలిగి ఉంటారు. కానీ వాడుతున్న నూనెను మాత్రం మార్చేందుకు సాహసం చేయరు. నూనెను మారిస్తే ఎటువంటి సమస్యలు వస్తాయో అని కంగారు పడతారు. కానీ మనం వాడే ఆయిల్ వల్లే మనం అనారోగ్యం పాలవుతున్నామని వైద్యులు చెబుతున్నారు. మనం వాడుతున్న నూనెలకు బదులుగా ఆలివ్ ఆయిల్ ను వాడడం చాలా మంచిది.

ఆలివ్ ఆయిల్ లో అనేక రకాల విటమిన్లు ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు మన ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. మనకు ఉన్న గుండె జబ్బుల సమస్యలను కూడా తగ్గిస్తాయి. మెరుగైన కంటి చూపు కోసం ఇవి ఎంతగానో దోహదం చేస్తాయట. అంతే కాకుండా ఈ నూనెను వాడడం వలన ఆహారం రుచి కూడా చాలా బాగుంటుందని వారి మాట. ఈ నూనెలో కేవలం 0.3 శాతం మాత్రమే యాసిడిటీ ఉంటుంది. కావున ఇది శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నూనెను వాడడం వలన జుట్టుతో పాటు అనేక రకాల చర్మ సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.
Read Also : Ayurveda Good for Heart : గుండె ఆరోగ్యానికి ఈ 5 ఆయుర్వేద మూలికలే సంజీవని..!