Alzheimer : ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది కొత్త కొత్త వ్యాధుల బారిన పడుతున్నారు. కారణం ఆహార అలవాట్లలో మార్పులు, సరిపడా నిద్రలేకపోవడం, ఒత్తిడి, డిప్రెషన్, నిద్రలేని రాత్రులు గడపడమే కారణంగా తెలుస్తోంది. ఇటువంటి కారణాల వలన ఈ మధ్యకాలంలో చాలా ‘అల్జీమర్స్’ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధి వలన మన నాడీ వ్యవస్థపై పని తీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. నాడీ వ్యవస్థ దెబ్బతింటే క్రమంగా ‘మెదడు’లోని కణాలు మరణిస్తూ వస్తాయి. దీంతో మనిషి ‘మెమోరీ పవర్’ను కోల్పోతాడు.
అల్జీమర్స్ వ్యాధి బాధితులు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నారు. 2060వ సంవత్సరం వచ్చే నాటికి ‘అల్జీమర్స్’వ్యాధి గ్రస్తులు రెట్టింపు స్థాయిలో పెరుగుతారని నిపుణులు అంచనా వేశారు. అల్జీమర్స్‌కు మరోపేరు ‘మతిమరుపు’..ఈ వ్యాధి బారిన పడిన వారి ప్రధాన లక్షణం ‘జ్ఞాపక శక్తి కోల్పోవడం’, ప్రతీ చిన్న విషయాన్ని మర్చిపోవడం, మాట్లాడటంలో తడపడటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఏదో చోట వస్తువులు, తాళాలు, పర్సు, డబ్బులు పెట్టి మర్చిపోతారు. పని విషయంలోనూ వెనుకాముందు ఆడుతుంటారు. బాస్ చెప్పేది మర్చిపోయే చీవాట్లు తినడం వంటివి జరుగుతుంటాయి. ఎప్పుడూ గందరగోళంగా ఉండటం ఈ వ్యాధి లక్షణాలు. వయస్సు పెరుగుతున్న కొద్దీ జ్జాపకశక్తి తగ్గిపోవడం, మనుషులను గుర్తుపట్టకుండా ఉండటం వంటివి జరుగుతుంటాయి.
Alzheimer : ఈ లక్షణాలు ఉంటే.. అల్జీమర్స్ వ్యాధి సోకినట్టే..!
అల్జీమర్స్ వ్యాధితో బాధపడేవారు తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలి. రోగిని చూసుకునే వారు తప్పకుండా ఓపికతో ఉండాలి. అప్పుడప్పుడు మిమ్మల్ని కూడా వారు మర్చిపోయే అవకాశం ఉంటుంది. అన్నింటినీ భరిస్తూ వారికి మందులు టైంకు ఇవ్వాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. టైంకు భోజనం అందించాలి. కేరింగా చూసుకోవాలి. అప్పుడే వారి మానసిక పరిస్థితి బాగుంటుంది. ఈ మధ్యకాలంలో తక్కువ వయస్సు వ్యక్తులు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా పెద్దవారిలో (60 ఏళ్లు) పై బడిన వారిలో మాత్రమే కనిపిస్తుంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ సలహా తీసుకుని క్రమంగా మందులు వాడాలి. అప్పుడే ఈ వ్యాధి కంట్రోల్‌లో ఉంటుంది.