Adulterated Food Check Up : తినే పదార్థాల్లో కల్తీ ఉంటే.. అది భవిష్యత్తులో బాడీపై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. బాడీలోని అన్ని వ్యవస్థలను నాశనం చేస్తుంది. కొందరు తమ బిజినెస్‌లో లాభం పొందేందుకు ఇలా కల్తీలకు పాల్పడుతుంటారు. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం విఫలమవుతుందని చెప్పొచ్చు. ఈ కల్తీని నివారించేందుకు ఆహార కల్తీ నిరోధక చట్టానికి మరింత పదుపు పెట్టాల్సిందే. ఇక ఇంట్లో మనం కల్తీలను ఎలా చెక్ చేసుకోవచ్చో ఒక సారి చూద్దాం.

పాలంటే అందరికీ ఇష్టమే.. ఎందుకంటే దీన్ని అన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మరి ఇందులో కల్తీ జరిగిందా? లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. చాలా మంది డిటర్జెంట్ వంటివి కలుపుతూ ఉంటారు. పాలను డబ్బాలో పోసి మూత టైట్ గా పెట్టి కాస్త షేక్ చేయాలి ఒక వేళ అందులో డిజర్జెంట్ వంటివి కలిపి కల్తీ చేస్తే నురగ ఎక్కువగా వస్తుంది. ఇక ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వంటి వాటిలో కృత్రిమంగా రంగులు వేసి అమ్ముతుంటారు. వాటిని కనిపెట్టాలంటే
తెల్లని బ్లాటింగ్ పేపర్‌ను కొద్దిగా వాటర్‌తో తడిపి కూరగాయలను, ఫ్రూట్స్‌ను తుడవాలి. దీని వల్లే వాటికి కృత్రిమ రంగులు అద్దారా? లేదా అనేది తేలిపోతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తినేది ఐస్‌క్రీమ్. దీనిలో సైతం కల్తీ జరుగుతుంది. కొంచెం ఐస్ క్రీమ్ తీసుకుని అందులో రెండు చుక్కల నిమ్మకాయ రసం కలపాలి.
అందులోంచి నురగ వస్తే అందులో డిటర్జెంట్ వంటి వాటిని కలిపారని గుర్తించాలి. ఇక మిరయాలను ఆల్కహాల్‌లో వేయాలి. అవి కల్తీవి కాకుంటే ఆల్కహాల్‌లో మునుగుతాయి. వీటితో పాటు ఉప్పు, చెక్కర, నూనె వంటిలోనూ కల్తీ జరుగుతుంది. వాటిని ఎప్పటికప్పుడూ మనం టెస్ట్ చేస్తూ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనారోగ్యానికి చాలా ప్రమాదకరమని గుర్తించాలి.
Read Also : Summer Health Tips : చంకల నుంచి వచ్చే దుర్వాసనతో తట్టుకోలేకపోతున్నారా.. ఇలా చేస్తే బెటర్‌గా ఫీలవుతారు..