Weight Loss : ప్రస్తుత సమాజంలో చాలా మంది ఓవర్ వెయిట్‌తో బాధపడుతున్నారు. ఒబెసిటి లేదా అధిక బరువు అనేది తినడం వల్లే వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ, సరైన వేళలో తినకపోవడం, ఆహారంలో మార్పులు, జంక్ ఫుడ్స్, కొవ్వు పదార్థాలు, తిన్న వెంటనే పడుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వలన కూడా పెరుగుతుంది. ఇలాంటి వ్యక్తులు బరువు తగ్గేందుకు జిమ్ లేదా యోగా సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. వాటి బదులు ఉదయాన్నే రన్నింగ్, స్కిప్పింగ్, జాగింగ్ చేయడం వలన కూడా తగ్గించుకోవచ్చును.

జంపింగ్ రోప్ రెగ్యలర్‌గా చేయడం వలన పొట్టలో ఫ్యాట్ తగ్గిపోతుంది. శరీరం మొత్తం మీద వెయిట్ పడుతుంది. కండరాలు అన్నీ కదులుతాయి. దీంతో బాడీ ఫ్రీగా ఉంటుంది. బాడీలోని మజిల్స్ గట్టిపడతాయి. ఇకపోతే కార్డియో వాస్క్యూలర్ విధానం, గుండె వాల్స్ను దృఢంగా ఉంచేందుకు పరిగెత్తడం చాలా బెనిఫిట్ అవుతంది. చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి.రక్తం సరఫరా బాగా అవుతుంది. రన్నింగ్ వలన బ్రెయిన్‌లో ఎండార్ఫిన్ అండ్ సెరోటిన్ వంటి రసాయనాలు విడుదల అవుతాయి. ఆ కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ మరియు ఆందోళన తగ్గుతుంది.
Read Also : Milk for Weight Loss : ప్రతిరోజూ పాలు తాగితే బరువు తగ్గుతారా? ఇందులో నిజమెంత? తప్పక తెలుసుకోండి..!