Drinking Water : ఉరుకుల పరుగుల జీవనంలో ఆరోగ్యంపైన దృష్టి సారించడం పట్ల చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇటీవల కాలంలో ప్రతీ ఒక్కరు హెల్త్‌పైన కాన్సంట్రేట్ చేస్తున్నారు. కాగా, ప్రతీ ఒక్కరు కావాల్సినంత మంచి నీళ్లు తాగితే చాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇకపోతే చాలా మంది వాటర్ ఎక్కువగా తీసుకుంటుండటం మనం చూడొచ్చు. అలా తీసుకోవడం మంచిదేనని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ పేర్కొంటున్నారు. మనుషుల ఆరోగ్యాన్ని కాపాడటంలో తాగు నీరు కీలక పాత్ర పోషిస్తుందని వివరిస్తున్నారు. వాటర్ కంటెంట్ బాడీలో ఉంటే చాలు..

అనారోగ్య సమస్యలు దరిచేరబోవని పేర్కొంటున్నారు. ప్రతీ రోజు సరిపడా నీటిని తీసుకుంటే చాలు..శరీరంలోని వివిధ రకాల ప్రక్రియలు సక్రమంగా జరుగుతాయని పేర్కొంటున్నారు వైద్యులు. ఇకపోతే తాగునీటిని తీసుకోకపోతే మనుషులు డీ హైడ్రేట్ అవడంతో పాటు అనారోగ్యం బారిన పడే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రతీ ఒక్కరు కంపల్సరీగా వాటర్ కంటెంట్ కావల్సినంతం తీసుకోవాలి. అయితే, ఎవరెవరు ఎంత వాటర్ తీసుకోవాలి? వారి బాడీ వెయిట్‌ను బట్టి నిర్ధారించుకోవాలి.45 కేజీల బరువున్నవారు ప్రతీ రోజు దాదాపు రెండు లీటర్ల తాగునీటిని తీసుకోవాలి. 50 కేజీల బరువున్న వారయితే రెండు లీటర్ల వాటర్ తీసుకోవాలి.
55 కేజీల బరువున్న వారు అయితే రెండున్నర లీటర్లు, 60 కిలలో బరువున్న వారు 2.5 లీటర్ల వాటర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. 65 కిలోలున్న వారు 2.7 లీటర్లు, 70 కిలోలున్న వారు 2.9 లీటర్ల నీటిని తీసుకోవాలి. 75 కిలోలున్న వారు 3.2 లీటర్లున్న వారు 80 కిలోలున్న వారు మూడున్నర లీటర్ల నీటిని తాగాలి. 85 కిలోలున్న వారు 3.7 లీటర్లను తీసుకోవాలి. 90 కిలోలున్న వారు నాలుగు లీటర్ల తాగునీటిని తీసుకోవాలి. 95 కిలోలు బరువున్న వారు నిత్యం నాలుగు లీటర్ల నీటిని తీసుకోవాలి. అదే వంద కిలోలు లేదా ఆ పైన బరువు ఉన్న వారు నాలుగున్నర నుంచి ఐదు లీటర్ల వరకు నీటిని తాగాలి.
Read Also : Spinach Breakfast : చలికాలంలో ఈ బ్రేక్ ఫాస్ట్ తప్పక తినాల్సిందే.. హెల్త్‌కు చాలా మంచిది తెలుసా?