cardio exercises : మారిన జీవనశైలి వల్ల చాలా మంది చిన్న వయసులోనే ఊబకాయులు అవుతున్నారు. బరువు చాలా పెరిగిపోతున్నారు. ఈ క్రమంలోనే వెయిట్ లాస్ అయ్యేందుకుగాను రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, కార్డియో ఈ ఎక్సర్‌సైజెస్ చేస్తే ఈజీగా వెయిట్ లాస్ కావచ్చట.. చాలా మంది అధిక బరువు తగ్గించుకునేందుకుగాను రకరకాల పద్ధతులు ఫాలో అవుతుంటారు. కాగా, ఈ కార్డియో ఎక్సర్ సైజెస్ చేస్తే కనుక వెయిట్ లాస్ ఈజీగా కావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందుకుగాను ఈ పద్ధతులు ఫాలో అవాలి.

అవేంటంటే.. కార్డియో ఎక్సర్‌సైజెస్ చేసే క్రమంలో స్ట్రెచింగ్, కార్డియో, స్ట్రెంత్ ట్రెయినింగ్ చేయాలి. ఈ మూడింటిని కలిపి చేస్తేనే వర్కవుట్ ప్రోగ్రం అవుతుందని, ఎక్స్ ట్రా ఎఫర్ట్స్ పెట్టకుండా హ్యాపీగా ఈ వర్కవుట్ చేస్తే కనుక వెయిట్ లాస్ కావొచ్చు. కార్డియో వాస్క్యులర్ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా హార్ట్ రేట్ బాగా పెరిగి, లంగ్స్ ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తాయి. కార్డియో చేయడం వలన రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చు. కార్డియో చేసిన తర్వాత స్ట్రెంత్ ట్రెయినింగ్ చేయాలి. ఇందులో భాగంగా ఓన్లీ బరువులు ఎత్తుకోవడమే కాదు..
ఇంకా చాలా పనులు చేయాలి. పుష్ అప్స్, స్క్వాట్స్, క్రంచెస్‌తో పాటు బాడీ వెయిట్ ఎక్సర్‌సైజెస్ కూడా చేయాలి. ఇలా చేయడం వలన కొవ్వు కరిగిపోతుంది. స్ట్రెంత్ ట్రెయినింగ్ చేసిన తర్వాత స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఈ స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్ చేయడం వల్ల బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది. స్ట్రెచింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ వర్కవుట్ అని గుర్తుంచుకోవాలి. వెయిట్ లాస్ లక్ష్యంగా పెట్టుకున్న వారు కంపల్సరీగా వీక్లి రొటీన్‌లో భాగంగా ఈ మూడింటినీ కలిపి వర్కవుట్ చేయాలి. ఇకపోతే ఈ వర్కవుట్ సెషన్స్ చేసే ముందు, తర్వాత పదినిమిషాలు రెస్ట్ తీసుకోవాలి.
Read Also : Death Symptoms : చావు మనకు దగ్గరవుతున్నప్పుడు ఈ సంకేతాలనిస్తుందట.. అప్పుడు ఏం జరుగుతుందంటే..?