Sunishith : ఇతడే సాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్.. పాపులారిటీ కోసం ఏదైనా మాట్లాడుతాడు.. కానీ, అది కొన్నిసార్లు బెడిసికొడుతుంది. సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో ఏదో ఒకటి వివాదాస్పద వ్యాఖ్యలతో ట్రెండ్ అవుతుంటాడు. చాలామంది సునిశత్ మాటలను పెద్దగా పట్టించుకోరు. గతంలో ఎంతమంది స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. అది వైరల్ కావడంతో వారి ఫ్యాన్స్ వచ్చి ఇతగాడిని చితక్కొట్టి పోతుంటారు.
ఇప్పుడు కూడా అలాంటి కామెంట్స్ చేయడంతో సునిశిత్‌కు దేహశుద్ధి జరిగింది. మెగా పవన్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన గురించి తప్పుడు కామెంట్స్ చేశాడు. అంతే.. మెగా ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నాడో వెతికి మరి చితక్కొట్టి పోయారు. మెగా హీరో ఫ్యామిలీ జోలికి వస్తే.. మెగా అభిమానులు ఊరుకుంటారా? సునిశిత్ తో క్షమాపణలు చెప్పించి మరి చితకబాదారు.

స్టార్ హీరోల పర్సనల్ లైఫ్ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసినవారికి వారి అభిమానులు ఇలా కోటింగ్ ఇస్తారు. అప్పట్లో లావణ్య త్రిపాఠితో తనకు పెళ్లి అయిందని ఇదే సునిశిత్ యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో చెప్పుకున్నాడు. ఈ వార్త వైరల్ కావడంతో అతనిపై లావణ్య త్రిపాఠి పోలీసులకు ఫిర్యాదు కూడా ఇవ్వాల్సి వచ్చింది.
Sunishith Comments : క్షమాపణలు చెప్పిన సాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్
ఇప్పుడు మెగా కోడలు ఉపాసన గురించి తప్పుడుగా మాట్లాడి మరోసారి సునిశిత్ వార్తల్లో నిలిచాడు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసన గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతే.. ఆ వీడియో వైరల్ కావడంతో మెగా అభిమానులు ఫైర్ అయ్యారు. సునిశిత్ ఇంటికి వెళ్లి మరి మెగా ఫ్యాన్స్ చితక్కొట్టారు. అంతేకాదు.. రామ్ చరణ్ తన స్నేహితుడని, ఉపాసనతో తాను చాట్ చేశానంటూ ఏదేదో మాట్లాడేశాడు. ఈ ఇంటర్వ్యూలో సునిశిత్ వ్యాఖ్యలు వైరల్ కావడంతో మెగా అభిమానులు మండిపడ్డారు.
సునిశిత్ ఉండే అపార్ట్ మెంట్ వద్దకు వెళ్లి మరి మెగా అభిమానులు చితక్కొట్టారు. మా వదిన మీద కామెంట్స్ చేస్తావా చావబాదారు. ఇంకోసారి ఇలాంటి కామెంట్స్ చేస్తే మామూలుగా ఉండదు అంటూ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. సాక్రిపైజింగ్ స్టార్ సునిశిత్‌తో మెగా కోడలు ఉపాసన, మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పించారు. సునిశిత్‌ను మెగా అభిమానులు చితక్కొట్టిన సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఉపాసన గురించి తప్పుగా మాట్లాడిన సునిశిత్ ను చితకబాదిన రాంచరణ్ ఫ్యాన్స్ 🔥🔥🔥
Inko sari social media lo kanapadadu inka 🤣😂@AlwaysRamCharan pic.twitter.com/xaOKTna0M5
— CHE GUEVARA™ (@Karthik4PSPK) May 13, 2023
నమస్తే అండీ.. నా పేరు సునిశిత్. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఉపాసన గారిపై తప్పుడు వ్యాఖ్యలు చేశాను.. మరోసారి ఇలాంటి కామెంట్స్ చేయను. తప్పుగా మాట్లాడినందుకు చాలా బాధగా ఉంది. ఉపాసన గారికి, రామ్ చరణ్ గారికి క్షమాపణలు తెలియజేస్తున్నానని సునిశిత్ వీడియోలో చెప్పుకొచ్చాడు.