Anchor Rashmi : యాంకర్ రష్మీ.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై యాంకర్‌గా రష్మీ ఫుల్ పాపులర్ అయింది. సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ (rashmi gautam) లవ్ ట్రాక్ బుల్లితెరపై బాగా వర్కౌట్ అయింది. ఈ ఇద్దరి కాంబినేషన్ కనిపిస్తే చాలు.. యువతలో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తుంటుంది. వీరిద్దరి లవ్ ట్రాక్ బాగానే నడిచింది. కొన్నాళ్లుకు సుధీర్‌కు సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి.
కొన్ని షోలకు యాంకర్‌గానూ.. అడపాదడపా సినిమాల్లో హీరోగా చాలా బిజీగా ఉన్నాడు. కానీ, రష్మీ మాత్రం ఇప్పటికీ యాంకర్‌గానే కొనసాగుతున్నారు. ఆమెకు అవకాశాలు రావడం లేదా? లేదంటే.. వచ్చిన అవకాశాల్లో ఆమెకు నచ్చిన రోల్స్ లేవని చేయడం లేదా? అని చాలామందిలో సందేహం రాకమానదు.. ఈ సందేహాలన్నింటికి యాంకర్ రష్మీ ఒక్క మాటలో సమాధానిమిచ్చారు.
ఇండస్ట్రీలోకి వచ్చి ఇంతకాలమైనా స్టార్ హీరోయిన్ గా ఎందుకు రాణించలేకపోయారు అంటే.. అందుకు చాలా కారణాలు ఉన్నాయని అంటోంది. జబర్దస్ యాంకర్ అనగానే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది యాంకర్ రష్మీనే.. ఇప్పుడు సుధీర్ లేకపోవడంతో రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకర్‌గా కొనసాగుతోంది. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ (sridevi drama company)లో తన సినిమా లైఫ్ గురించి ఆసక్తికరమైన విషయాలను రివీల్ చేసింది. ఓపెన్ టాస్క్‌లో రష్మీ అనేక వాస్తవాలను బయటపెట్టారు. ప్రొగ్రామ్ జడ్జీ అయిన ఇంద్రజ రష్మీని తన సినిమా కెరీర్ గురించి వాస్తవాలను చెప్పాలని అడిగారు.
Anchor Rashmi : ఇంద్రజ అడిగిన ప్రశ్నకు యాంకర్ రష్మీ ఏమన్నారంటే?
అందులో ఒక ప్రశ్నగా కొత్తగా వచ్చిన ఎంతోమంది హీరోయిన్లుగా రాణిస్తుంటే.. రష్మీ నువ్వు మాత్రం ఎందుకు హీరోయిన్ కాలేకపోయావని, నీకు అవకాశాలు రావడం లేదా? అని సూటిగా ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు రష్మీ కూడా అలానే సమాధానమిచ్చింది. సినిమా అవకాశాలు బాగానే వస్తున్నాయని బదులిచ్చింది. కానీ, వచ్చిన అవకాశాలు ఏవి నిలబడటం లేదట.. ముందుగా అవకాశమిచ్చినట్టే ఇచ్చి తర్వాత మరొకరిని తీసుకుంటున్నారని వాపోయింది. ఇందుకు ఇలా జరుగుతుందో తనకు తెలియదన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతిఒక్కరిపై ఏదో ఒక సందర్భంలో ఒక ముద్ర పడిపోతుంది. వీరు ఇంతే.. ఈ రోల్స్ కు మాత్రమే సూట్ అవుతారు అనే ముద్ర వేస్తారు.
ఫస్ట్ హీరోయిన్ ఛాన్స్ ఏమో గానీ, సెకండ్ హీరోయిన్ రోల్స్ మాత్రమే ఇస్తామంటారు. ఇంకా స్టార్ హీరోయిన్ వరకు వెళ్లడమా? అన్నట్టుగా తన మనసులోని బాధన వెలిబుచ్చింది. హీరోయిన్ ఛాన్స్ కాకుండా ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలకు మాత్రమే సరిపోతారు అన్నట్టుగా ముద్ర పడిపోయింది. అందుకే నన్ను ఎవరైనా చూడగానే హీరోయిన్ మెటేరియల్ అనే భావన రావడం లేదనుకుంట.. బహుషా యాంకర్‌గానే ఆమె చేయగలదనే అభిప్రాయం ఉండొచ్చు.. అందుకే నాకు అవకాశాలు రావడం లేదేమో.. వచ్చిన ఒకటి రెండు అవకాశాలు కూడా వేరే వాళ్లు తన్నుకుపోతున్నారు.. ఇంకా నాకు ఛాన్స్ దక్కేది ఎక్కడా? అంటూ రష్మీ ఆమెలోని బాధను మొత్తం ఒక్కసారిగా బయటపెట్టేసింది.