Dhee Chaitanya Death : మాస్టర్ చైతన్య పేమెంట్ అందుకే ఆపేశారు.. పల్సర్ బైక్ ఝాన్సీ సంచలన కామెంట్స్..!

Dhee Chaitanya Death : తెలుగు బుల్లితెర డాన్స్ షో ఢీ మాస్టర్ చైతన్య ఆత్మహత్యకు సంబంధించి అనేక సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పుల భారంతోనే మాస్టర్ చైతన్య ఆత్మహత్యకు పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పల్సర్ బైక్ ఝాన్సీ అసలు వాస్తవాలను బయటపెట్టారు. చైతన్య అప్పులకు అసలు కారణం ఇదేనన్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన చైతన్యకు రావాల్సిన పేమెంట్స్ ఆపేయడమే కారణమని ఝాన్సీ తెలిపారు.

డాన్స్ షోలో ఝాన్సీ చైతన్యతో కలిసి పనిచేశారు. డిసెంబర్ 31న చైతన్య ఈవెంట్ నిర్వహించారు. అయితే, కొందరు ఆర్టిస్టులు ఈవెంటుకు వస్తానని చెప్పి రాలేదు. ఈవెంట్ ఆర్గనైజర్స్ చైతన్యకు రావాల్సిన పేమెంట్ ఆపేశారు. దాదాపు ఆరు లక్షల రూపాయలు రావాల్సి ఉంది. కానీ, పేమెంట్ రాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో చైతన్య అప్పులు చేయాల్సి వచ్చింది. తన ఆర్టిస్టులకు డబ్బులు ఇచ్చేందుకు అప్పులు చేయాల్సి వచ్చిందని ఝాన్సీ పేర్కొన్నారు.

Dhee Chaitanya Master Death, pulsar bike jhansi comments Viral
Dhee Chaitanya Master Death, pulsar bike jhansi comments Viral

మాస్టర్ చైతన్య చాలా మంచి వ్యక్తి. పక్కవాళ్ళకు మంచి చేయాలనే ఆలోచిస్తుంటారు. తనకు తోచిన సాయ చేస్తుంటారు. ఒంగోలులో ఈవెంట్ సమయంలో చైతన్య మరణవార్త తెలిసి షాకయ్యాను. కొందరు ఆర్టిస్టులకు చైతన్య డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు ఆయనకు పదేపదే ఫోన్స్ చేస్తున్నారు. ఇలాంటి సమస్య ఉంటే.. కూర్చొని వారికి అర్థమయ్యేలా చెబితే బాగుండేది. నా వల్ల కాదని చెప్పి ఉండాల్సింది. ఇలా ప్రాణాలు తీసుకున్నారు. చైతన్య తొందరపాటు నిర్ణయంతో వాళ్ల అమ్మ, నాన్న, చెల్లి ఎంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారని ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఝాన్సీ ఈవెంట్ నిర్వాహకులకు రిక్వెస్ట్ చేశారు.. ఆరోగ్యం బాగోలేకున్నా వచ్చి షో చేస్తాము.. మా పర్ఫార్మెన్స్ నచ్చకుంటే మరోసారి పిలవకండి.. అంతేగానీ.. ఇలా పేమెంట్స్ ఆపవద్దని ఝాన్సీ అన్నారు. పేమెంట్స్ ఆపడం ద్వారా అనేక మంది ఆర్టిసుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఝాన్సీ వాపోయారు. అప్పుల బాధ తట్టుకోలేక నెల్లూరులోని ఓ హోటల్‌లో చైతన్య మాస్టర్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆత్మహత్యకు ముందు చైతన్య సెల్ఫీ వీడియో రికార్డు చేశారు. ఇప్పుడా సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also : Dhee Chaitanya Video : ఢీ డాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్.. సెల్ఫీ వీడియోతో బయటపడ్డ షాకింగ్ నిజాలు…!

Leave a Comment