Naga Chaitanya Samantha : అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. రిల్ లైఫ్‌తో మొదలైన జెర్నీ రియల్ లైఫ్‌తో ఎండ్ అయింది. బెస్ట్ కపుల్స్ అంటే.. నాగచైతన్య, సమంతనే అనంతంగా క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రతిఒక్కరూ వీరిద్దరిని చూడగానే ముచ్చటైన జంట అనుకునేవారు. ఏమైందో ఏమో ఒక్కసారిగా ఈ జంట తమ పెళ్లిబంధానికి బ్రేకప్ చెప్పుకున్నారు. వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియక చాలామంది అనేకరకాలుగా మాట్లాడుకున్నారు.
అసలు విడాకులు దారితీయడానికి అసలు కారణం ఇదే అని ఎక్కడ కూడా సమంత, నాగచైతన్య బయపెట్టలేదు. విడాకుల అనంతరం ఇద్దరూ తమ ప్రొఫెషనల్ వర్క్‌లో బిజీగా ఉంటున్నారు. సమంత, చైతూ గురించి ఎప్పుడు ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. సమంత విషయంలో ఏదో ఒక గాసిప్ చక్కర్లు కొడుతూనే ఉంటోంది. ఇప్పుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది. నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి అసలు కారణం ఇదేనంటూ వార్త హల్ చల్ చేస్తోంది.
అది ఎంతవరకూ కరెక్ట్ అనేది తెలియదు కానీ.. ఇందుకే ఇద్దరూ విడాకుల దాకా వెళ్లారని అంటున్నారు. నాగచైతన్య, సమంత మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయని వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఇద్దరి మధ్య మరింత దూరాన్ని పెంచడానికి ఒక ఫంక్షన్‌కు వెళ్లడమే కారణమట.. ఆ పార్టీకి వెళ్లిన సమయంలో సమంత గురించి అదో రకంగా మాట్లాడారట.. దానికి కారణం.. సమంత ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్‌లో బోల్డ్ క్యారెక్టర్ గా చేయడమే.. ఈ విషయమై చాలామంది సమంతను ఎందుకు అలా చేశావంటూ అడిగారట..

Naga Chaitanya Samantha : నాగార్జున మాట కూడా వినలేదట..
సమంతతో కలిసి పార్టీకి వెళ్లిన నాగ చైతన్యకు చాలా ఇబ్బందిగా అనిపించందట.. పెళ్లి అయిన తర్వాత సినిమాలు చేయొద్దని పదేపదే చెబుతున్నా సమంత చైతూ మాట వినలేదట.. అందులోనూ బోల్డ్‌గా నటించడం చైతూకు నచ్చలేదట.. ఇద్దరి మధ్య ఈ విషయంలో చాలాసార్లు మాటమాట అనుకున్నారట.. అప్పుడే ఇద్దరూ ఆ పార్టీకి వెళ్లడం అక్కడ వారంత కూడా సమంతను అదోలా చూడటం.. ఎందుకు అలా నటించావని అడగడం అని చూసిన చైతూకి ఇంకా కోపం వచ్చిందట.. ఆ పార్టీలో సమంతను కూడా దూరం పెట్టాడట..
చైతూ పదేపదే ఆ మాటలు అనడంతో విసిగిపోయిన సమంత ఇంటికి వెళ్లిన తర్వాత గట్టిగా అరిచేసిందట.. అంతే.. ఇద్దరి మధ్య మరింత మాటలు పేలాయి. చివరికి ఇద్దరి నోటవెంట బ్రేకప్ అనే మాట వచ్చింది. నాగార్జున కూడా జోక్యం చేసుకుని కూల్ చేసేందుకు ప్రయత్నించినా మాట వినలేదట.. ఇద్దరూ విడాకులు తీసుకోవడానికే రెడీ అయారట.. మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ నాగ్ సైలంట్ అయిపోయారట.. అప్పుడే వీరిద్దరి మధ్య విడాకులకు దారితీసిందనే న్యూస్ వైరల్ అవుతోంది.