Sitara Ghattamaneni : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) గారాల పట్టి సితార (Sitara)పై భారీగా ట్రోల్స్ నడుస్తోంది. సితార చేసిన పనికి నెటిజన్లంతా ఏకిపారేస్తున్నారు. సోషల్ మీడియాలో సితార ఎప్పుడూ యాక్టివ్ ఉంటారని సంగతి తెలిసిందే.. ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలతో పాటు అప్పుడప్పుడు తన చిలిపి పనులను కూడా సోషల్ మీడియా షేర్ చేస్తుంటారు. స్టార్ కిడ్‌గా సితార ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.
ఒకవైపు చదువును కొనసాగిస్తూనే మరోవైపు డాన్స్, ఆటలు, ఫొటోషూట్స్, టూర్లకు సంబంధించి ఫొటోలను సితార తన సోషల్ అకౌంట్లలో షేర్ చేస్తున్నారు. లేటెస్టుగా సితార పోస్టు చేయగా.. అది చూసిన నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నరు. అలాంటిది ఇప్పుడు ఇలా చేసినందుకు నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఫస్ట్ టైం సితార పోస్టు చేసిన ఫొటోలను చూసిన నెటిజన్లు ఒక్కొక్కరుగా ఒక్కోలా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
నెటిజన్లు ఇంతగా ట్రోల్స్ చేయడానికి సితార చేసిన తప్పేంటంటే.. వెళ్తున్న కారు విండోలో నుంచి తల బయటకు పెట్టడమే.. అదే సమయంలో ఫొటోలకు కూడా ఫొజులిచ్చారు. తన క్యూట్ స్మైల్‌తో సితార అందరిని ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలను చూసిన కొంతమంది ఫైర్ అయ్యారు. కారు వెళ్తుండగా ఇలా బయటకు తలపెట్టడం మంచిది కాదని నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. స్టార్ కిడ్ అయిన నువ్వే ఇలా చేస్తే.. నిన్ను చూసి మిగతా పిల్లలు కూడా చేస్తారని అంటున్నారు.
ట్రాఫిక్ సమయంలో రోడ్డు మీద వెళ్లేటప్పుడు పిల్లలు ఎవరైనా ఇలా ఫొటోలకు ఫొజులిస్తే.. ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో నువ్వు పెట్టే పోస్టులు అందరికి ఉపయోగపడేలా ఉండాలని నెటిజన్లు స్పందిస్తున్నారు. స్టార్ కిడ్ కావడంతో జనాలపై దీని ప్రభావం ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. కొందరు సితార చేసిన పనిని విమర్శిస్తుంటే.. మరికొందరు నెటిజన్లు మాత్రం క్యూట్ లుక్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సితార పోస్టు చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో మరింతగా షేర్లు చేస్తున్నారు.
Read Also : Renu Desai : అకీరా నా కొడుకు.. మీ హద్దులను మీరొద్దు.. పవన్ ఫ్యాన్స్‌కు రేణు దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్..!