Renu Desai : అకీరా నా కొడుకు.. మీ హద్దులను మీరొద్దు.. పవన్ ఫ్యాన్స్‌కు రేణు దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్..!

Renu Desai : సోషల్ మీడియాలో అకీరా నందన్ (Akira Nandan) ఫొటోలను పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai) సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఆమె పోస్టు చేసిన చాలా ఫొటోలు, వీడియోల్లో అకీరా మొఖం కనిపించదు. అకీరా పుట్టిన రోజున కూడా రేణు షేర్ చేసిన అకీరా వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో అకీరా కనిపించకపోవడంపై పవన్ ఫ్యాన్స్  (Pawan Fans) కామెంట్స్ చేశారు. దాంతో రేణు దేశాయ్ సీరియస్ అయ్యారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌పై రేణు దేశాయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అకీరా విషయంలో పవన్ ఫ్యాన్స్ చేసిన కామెంట్స్‌పై రేణు దేశాయ్ ఘాటుగా స్పందించారు.

Renu Desai Strong Warning to Pawan Kalyan fans regarding Akira Nandan Birthday
Renu Desai Strong Warning to Pawan Kalyan fans regarding Akira Nandan Birthday

ఏప్రిల్ 8న అకీరా పుట్టినరోజు.. (Akira Birthday) ఈ సందర్భంగా పవన్ అభిమాని (Pawan Fan) ఒకరు.. అకీరా గురించి ఒక విషయాన్ని ఇలా అడిగారు.. మా అన్న కొడుకు అకీరా ను సరిగా చూపించండి.. ఇలా దాచిపెట్టకండి అంటూ కామెంట్ చేశాడు. ఆ మాటలకు రేణు దేశాయ్ సీరియస్ అయ్యారు. మీ అన్న కొడుకు.. అకీరా నా కొడుకు.. ఒక తల్లికి పుట్టలేదా? మీరు.. అంటూ ఆమె ఫైర్ అయ్యారు.

పవన్ కు మీరు ఫ్యాన్స్ కావొచ్చు.. నేను అర్థం చేసుకోగలను.. ముందుగా ఆడవాళ్లతో పద్ధతిగా ఎలా మాట్లాడాలో నేర్చుకోండి.. నెగటివ్ కామెంట్లు పెట్టేవారిని పట్టించుకోవడం మానేశాను.. ఎంతో ఓర్పుతో సహనంగా ఉంటున్నాను. కానీ, మీరు మీ హద్దులను మితిమీరుతున్నారంటూ రేణు దేశాయ్ ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది.

Renu Desai Strong Warning to Pawan Kalyan fans regarding Akira Nandan Birthday
Renu Desai Strong Warning to Pawan Kalyan fans regarding Akira Nandan Birthday

రేణ్ దేశాయ్ కామెంట్లపై పవన్ ఫ్యాన్స్ మాత్రం కూల్‌గా రియాక్ట్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఎవ‌రి అబ్బాయివి అని అడిగితే అందరూ తండ్రి పేరే చెబుతారు. పవన్ ఫ్యాన్స్ మీద ఇలా ఫైర్ కాకండి’ అంటూ రిప్లయ్ చేశారు. దానిపై రేణు స్పందిస్తూ.. ‘మీరు స్త్రీ జాతిని అవ‌మానిస్తున్నారు. దేవుడి కన్నా గొప్ప స్థానం త‌ల్లిదే.. మీకు తెలియకపోతే మీ అమ్మ‌ను అడ‌గండి’ రిప్లయ్ ఇచ్చారు. అకీరా బ‌ర్త్‌డే (Renu Desai Instagram) రోజున ఇన్‌స్టాగ్రామ్‌లో నెగెటివ్ కామెంట్స్ పెడుతూ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు.

11 ఏళ్ల నుంచి నేను భరిస్తూనే ఉన్నాను. కానీ, త‌ల్లిగా ఎప్పుడూ బాధపడుతునే ఉన్నాను. మీ స‌మ‌స్య ఏంటి? అనేది నాకు అర్థం కావ‌టం లేదని రేణు ఎమోషనల్‌ అయ్యారు. అకీరా నందన్‌కి 19 ఏళ్లు పూర్తి కావడంతో పవన్ వారసుడిగా సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Read Also : Chicken Haleem Recipe : హైదరాబాద్ చికెన్ హలీమ్.. ఇంట్లోనే ఇలా ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు తెలుసా?

Leave a Comment