Chicken Haleem Recipe : హైదరాబాద్ చికెన్ హలీమ్ ఎప్పుడైనా తిన్నారా? చాలా టేస్టీగా ఉంటుంది. రంజాన్ మాసంలో చికెన్ హాలీమ్ ఒకసారైనా టేస్ట్ చూడాల్సిందే. ఒకసారి తింటే… మళ్లీ మళ్లీ తినాలపించేలా ఉంటుంది. అందుకే హైదరాబాద్ హాలీమ్కు అంత క్రేజ్.. అంతేకాదు.. రుచికి రుచికి ఆరోగ్యం కూడా… అందుకే చాలామంది ఈ చికెన్ హాలీమ్ తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇంతకీ.. ఈ హైదరాబాద్ చికెన్ హాలీమ్ ఇంట్లో చేసుకోలేమా? అంటే.. చాలా సింపుల్గా ఇంట్లోనే హాలీమ్ తయారు చేసుకోవచ్చు.
చికెన్ హలీమ్ కావలసిన పదార్థాలు…
మినప్పప్పు 2 టేబుల్ స్పూన్స్, ఎర్ర పప్పు 2 టేబుల్ స్పూన్స్, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, పెసరపప్పు 2 టేబుల్ స్పూన్స్, కందిపప్పు 2 టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయ 1, చికెన్ బౌన్ లెస్ ఆఫ్ కేజీ, జీడిపప్పు, గోధుమ రవ్వ ఒక కప్పు, దాల్చిన చెక్క రెండు ఇంచులు, యాలకులు 4, లవంగాలు , సాజీర, పచ్చిమిర్చి 5, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్1 టేబుల్ స్పూన్, కారం ఒక టీ స్పూన్, మిరియాలు, జీలకర్ర, ఉప్పు, నూనె, ధనియాల పొడి, గరం మసాల పొడి, పెరుగు, హలీమ్ చేయడానికి ఒక పెద్ద. వేయించుకోవాలి
తయారీ విధానం…
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పప్పులను దోరగా వేయించుకోవాలి.. అలా ఎంచుకోవడం వల్ల టేస్టీగా వస్తుంది. వేయించిన పప్పులు చల్లారాక మిక్సీ జార్ తీసుకొని ఐదు జీడి పలుకులు, పప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పొడిని ఒక బౌల్లో పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపోయేంత ఆయిల్ పోసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లో పెట్టుకోవాలి. వేడిగా ఉన్న నూనెలో15 జీడిపప్పు తీసుకొని ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి.
హలీం చేయడానికి ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి అందులో లీటర్ వాటర్ పోసి వేడి చేసుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు ముందుగా నాన పెట్టుకున్న గోధుమరవ్వ, పప్పుల పొడి, సాజీర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సన్నగా నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వీటన్నిటిని వేడి నీళ్లలో వేసి 15,20 నిమిషాలు బాగా ఉడికించాలి..మూత పెట్టి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి పేస్ట్ చేసుకోవాలి..
మరోవైపు కుక్కర్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసి తరవాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. శుభ్రంగా కడుక్కున్న చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ లో ఉన్న వాటర్ అంత పోయే వరకు ఉడికించాలి. అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, జీలకర్ర హాఫ్ టీ స్పూన్, మిరియాలు10,20, ధనియాల పొడి ఆఫ్ టీ స్పూన్, గరం మసాలా ఒక టీ స్పూన్, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా, హాఫ్ కప్పు పెరుగు, వేసి కలపాలి.
మూడు నిమిషాల తర్వాత చికెన్ లో పావు లీటర్ నీళ్లు పోసి మెత్తగా ఉడకడానికి కుక్కర్ మూత పెట్టి5,6 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. కుక్కర్ ప్రెషర్ తీసి చికెన్ కూర చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్లో చికెన్ పేస్టు, గ్రైండ్ చేసిన గోధుమ రవ్వ, కొంచెం కొత్తిమీర, పుదీనా ఆకులు, బ్రౌన్ చేసుకున్న ఉల్లిపాయ సగం, నెయ్యి వేసి కలపాలి. సరిపోయే కొన్ని నీళ్లు పోసి 10,15 నిమిషాలు స్టవ్ పై మీడియం ఫ్లేమ్ లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి.. ఇప్పుడు చికెన్ హలీం ఒక గిన్నెలో వేసుకొని కొంచెం నెయ్యి, కొత్తిమీర ,పుదీనా, వేయించుకున్న జీడిపప్పు, బ్రౌన్ ఉల్లిపాయ వీటన్నిటిని పైన చల్లుకొని తింటే ఎంతో టేస్టీ రుచికరమైన హలీం రెడీ…