Niharika Chaitanya : నిహారిక కొణిదెల, చెైతన్య జొన్నగడ్డ విడాకులు తీసుకుంటున్నారా? సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ నడుస్తోంది. పెళ్లి అయిన కొత్తలో నిహారిక, చైతన్య చాలా అనోన్యంగా ఉండేవారు. మధ్యలో ఏమైందో తెలియదు కానీ, ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అది కాస్తా విడాకులుంటూ అనేక పుకార్లకు దారితీసింది.
సోషల్ మీడియాలో నిహారిక విడాకుల వార్తలే ఎక్కువగా హల్ చల్ చేస్తున్నాయి. నిజంగా.. నిహారిక, చైతన్య విడాకులు తీసుకోబోతున్నారంటే.. ఈ విషయంలో అటు మెగా ఫ్యామిలీ కానీ, చైతన్య కుటుంబ సభ్యులు కానీ ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. ఇరువురి కుటుంబ సభ్యులు సైలెంట్ గా ఉండటంతో విడాకుల వార్తలపై మరింత అనుమానాలకు తావిస్తోంది.
అదే సమయంలో ఇటీవలే నిహారిక తన సోషల్ అకౌంట్లో చైతన్యతో కలిసి దిగిన ఫొటోలను అన్ని డిలీట్ చేసింది. అంతేకాదు.. నిహారిక పింక్ ప్రొడక్షన్స్ బ్యానర్ కొత్త ఆఫీస్ ఏర్పాటు చేశారు. కానీ, ఈ ఆఫీస్ ఓపెనింగ్ సమయంలో కూడా చైతన్య కనిపించలేదు.
దాంతో నిహారిక, చైతన్య విడాకులు తీసుకుంటారనే వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది. చైతన్య జొన్నలగడ్డ ఫ్యాషన్ దుస్తుల ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చైతూ ఫొటోలపై కూడా నిహారిక స్పందించలేదు. అంటే.. ఇరువురి మధ్య దూరం ఉందనే అనుమానాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో విడాకుల వార్తలకు చెక్ పడేలా చైతన్య జొన్నలగడ్డ ఒక్క ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
అందులో భార్య నిహారికతో కలిసి దిగిన ఫొటోలను చూసి నెటిజన్లంతా షాకవుతున్నారు. మీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారా? అంటూ చైతూను నెటిజన్లు కామెంట్ల రూపంలో విసిగించడంతో చైతూ ఇలా కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తన సోషల్ అకౌంట్లలో కామెంట్ సెక్షన్ కూడా ఆఫ్ చేసినట్టు తెలిసింది.
నిహారికతో కలిసి ఉన్న వీడియోను చైతూ తన సోషల్ అకౌంట్లలో పోస్టు చేశాడు. అందులో షూతో వర్కౌట్ చేస్తున్నట్టుగా ఉంది. అంటే.. విడాకుల వార్తలకు చైతూ ఒక్క ఫొటోతో గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు అనమాట.. మెగా ఫ్యాన్స్ మాత్రం.. నిహారిక, చైతన్య జొన్నలగడ్డ ఎప్పటిలానే తమ జీవితాన్ని కలిసి కొనసాగించాలని కోరుకుంటున్నారు.
Read Also : Arranged Marriages : పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు.. ఎందుకు కలకలం నిలబడతాయో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే..!