Arranged Marriages : ప్రస్తుత జనరేషన్‌లో చాలా మంది లవ్ మ్యారేజెస్‌కు మొగ్గుచూపుతున్న విషయం తెలిసిందే. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడానికి నేటితరం వెనకాముందు అవుతోంది. ఎందుకంటే తమ భాగస్వామని తామే ఎంచుకుని, వారి గురించి పూర్తిగా అర్థం చేసుకున్నాకే.. అతను అన్నింటిలోనూ పర్‌ఫెక్ట్ అని తేలితేనే పెళ్లికి సిద్ధం అవుతున్నారు.లేనియెడల మధ్యలోనే తెగదెంపులు చేసుకుంటున్నారు. కానీ పెద్దలు కుదిర్చిన సంబంధంలో నచ్చినా, నచ్చకపోయినా రిలేషన్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఉండదు.
ఒకవేళ దంపతులు ఇద్దరికీ పడకపోతే కోర్టు ద్వారా విడిపోవడానికి అనుమతి తీసుకోవాలి. అరేంజ్ మ్యారేజ్‌లో అమ్మాయి లేదా అబ్బాయి పెళ్లాయ్యాక మంచి వారు తెలిస్తే ఒకే.. లేనియెడల ఒకరిపైఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ గుట్టుగా చేయాల్సిన సంసారాన్ని రచ్చకీడుస్తారు. ఇటువంటి తలనొప్పులు వద్దనే నేటి యువత ప్రేమవివాహలకు ఓటు వేస్తున్నారు. అయితే, లవ్ మ్యారేజెస్‌తో పోలిస్తే పెద్దలు కుదిర్చిన పెళ్లిల్లే చాలా కాలం వరకు నిలబడుతున్నాయట.. ఎందుకో తెలియాలంటే రీడ్ దిస్ స్టోరీ..

సంప్రదాయమే కాపాడుతుందా? :
దేశంలో పూర్వకాలం నుంచే పెద్దలు కుదిర్చిన వివాహాలు జరుగుతూ వస్తున్నాయి. పాశ్చాత్య సంస్కృతి వల్లే ప్రేమ వివాహలు వచ్చాయని చాలా మంది చెప్పుకుంటున్నారు. అయితే, మనదేశంలోని సంస్కృతి, సంప్రదాయాలు పెద్దలు కుదిర్చిన పెళ్లి విషయంలో బలమైన పునాదులుగా కొనసాగుతూ వస్తున్నాయి. కొన్ని యుగాలు, తరతరాలుగా ఇవే మనకు వారసత్వంగా లభించాయి. ఇది పిత్రుస్వామ్య వ్యవస్థను ప్రోత్సహిస్తోందని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా దీని వల్లే నేడు భారతీయ సంప్రదాయ వివాహాలు పాశ్యాత్చ కల్చర్ను దీటుగా ఎదుర్కొని ముందుకు సాగుతున్నాయి. నేటికి భారతీయ వివాహా సంప్రదాయ, ఆచారాలను విదేశీయులు గౌరవిస్తున్నారు.
ఇరు కుటుంబ నేపథ్యాలపై ఆరా.. :
తమ పిల్లలకు పెళ్లి చేసే ముందే పెద్దలు వారి ఇష్టాలు, అభిరుచులకు తొలి ప్రాధాన్యత ఇస్తుంటారు. వారికి ఎలాంటి వారు సెట్ అవుతారో తెలుసుకుని తగిన జోడి కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. అమ్మాయి, అబ్బాయి కుటుంబ నేపథ్యాలపై పెళ్లికి ముందే ఆరా తీసి ప్రొసీడ్ అవుతుంటారు. పెళ్లయ్యాక అత్తింట్లో ఎలా ఉండాలని తమ కూతురికి ముందే నేర్పిస్తారు. అలాగే అబ్బాయికి కూడా ఒక మంచి భర్తగా ఎలా మెలగాలో చెబుతారు. పెద్దల పట్ల గౌరవంగా ఉండాలని, పిల్లల పట్ల దయాగుణంలో ఉండాలని చెబుతారు. ముఖ్యంగా పెద్దలు కుదిర్చే పెళ్లిలో అమ్మాయికి సర్వం భర్తే అని.. అత్తమామలు తల్లిదండ్రులతో సమానం అని నేర్పిస్తారు. ఇలా చేయడం వలన అత్తింట్లో అడుగుపెట్టిన కొత్త కోడలు వారి కుటుంబంతో త్వరగా కలిసిపోవడానికి ఆస్కారం ఉంటుంది.
అదే లవ్ మ్యారేజ్‌లో ఇవన్నీ నేర్పించరు కావున కొత్తగా వచ్చిన కోడలు అత్తింటివారిని చిన్న చూపు చూడొచ్చు. దీంతో గొడవలు ప్రారంభమవుతాయి.ఇంకొక ముఖ్యమైన విషయం ఎంటంటే.. పెద్దలు కుదర్చిన పెళ్లి తర్వాత తమ భాగస్వామి గురించి తెలుసుకోవడానికి అమ్మాయి, అబ్బాయి ప్రయత్నిస్తారు. ఎక్కువసేపు మాట్లాడుకుంటారు. వీరికి అప్పుడు బోర్ కొట్టదు.ప్రతీది షేర్ చేసుకుంటారు. వీలైనంత వరకు దగ్గరగా ఉండేందుకు ట్రై చేస్తారు. కానీ ప్రేమ వివాహంలో అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ముందే పరిచయం.. పెళ్లి తర్వాత మాట్లాడుకోవాల్సిన అన్ని విషయాలు ముందే మాట్లాడుకుంటారు.దీంతో వీరికి పెళ్లాయ్యాక మాట్లాడుకోవడానికి ఏం ఉందు. ఇది కూడా వీరిమధ్య గ్యాప్ పెరగడానికి కారణమై విడాకులకు దారితీయొచ్చు.
Read Also : Marriage Life : ఇలా చేస్తే.. మీ భాగస్వామిలో ఆ కోరిక పుట్టించవచ్చు.. ఆగకుండా పడక గదిలో రెచ్చిపోతారు..!