Honey Rose : బాలయ్య హీరోయిన్ హనీ రోజ్.. టాలీవుడ్ ఎంట్రీతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. వీర సింహారెడ్డి మూవీలో హనీ రోజ్ ఒక పాటతో జనాల్లో పూనకాళ్లు తెప్పించింది. ఈ మూవీలో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే పాటతో రెచ్చిపోయింది. ఈ ఒక్క పాటతో మలయాళీ బ్యూటీ హనీ రోజ్ రేంజ్ మారిపోయింది. ఫుల్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
అప్పటినుంచి హనీ రోజ్ పేరు టాలీవుడ్‌లో ఫుల్ పాపులర్ అయిపోయింది. ఎక్కడికి వెళ్లినా హనీరోజ్ కనిపిస్తే చాలు.. జనాల్లో ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు ఈ అమ్మడికి టాలీవుడ్‌లో ఆఫర్లు మీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఎన్ని ఆఫర్లు వచ్చినా మాత్రం హనీ రోజ్‌కు మాత్రం అసలే నచ్చడం లేదట.. ఎన్ని ఆఫర్లు వచ్చినా డైరెక్టర్లు హీరోయిన్ ఛాన్స్ మాత్రం ఇవ్వడం లేదట..

అసలు కారణం.. హనీ రోజ్ చూడటానికి కొంచెం బొద్దుగా ఉండటమేనట.. చబ్బిగా కనిపించే హనీ రోజ్ ను చూసి డైరెక్టర్లు హీరోయిన్ రోల్ ఇవ్వలేమని తేల్చి చెబుతున్నారట.. ఐటెం గర్ల్ పాత్రలు ఇచ్చేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారట.. కానీ, హనీ రోజ్ మాత్రం అందుకు ససేమిరా అంటోంది.
ఒకవేళ చేస్తే.. హీరోయిన్ రోల్ చేస్తాను.. ఐటెం గర్ల్ రోల్ వద్దంటే వద్దు అన్నట్టుగా ఉంటోంది. హనీ రోజ్‌ను డైరెక్టర్లు కాస్తా బరువు తగ్గమని అంటున్నారట.. అందాలను ఆరబోసేందుకు మాత్రమే హనీ రోజ్ సూట్ అవుతుందని నెటిజన్లు సైతం ట్రోల్స్ చేస్తున్నారట.. ఐటమ్ సాంగ్‌లకు పర్ఫెక్ట్ ఫిగర్ అని కామెంట్లు చేస్తున్నారట..
Read Also : Arranged Marriages : పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు.. ఎందుకు కలకలం నిలబడతాయో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే..!