Prosopis Juliflora Benefits : పేరుకే పిచ్చి మొక్క.. దాని ప్రయోజనాలు తెలిస్తే షాకవ్వాల్సిందే…!

Prosopis Juliflora Benefits : గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతంలో ప్రజల ఉపాధిని దెబ్బతీసిన ఓ కలుపుమొక్క గురించి చాలా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ప్రొసోపిస్ జలిఫ్లొరా అనే మొక్క చాలా హానికరమైనది. కచ్ ప్రాంతంలో ఉండే సంప్రదాయ బన్ని గడ్డి భూములను ఇది నాశనం చేసింది. దీనిని అక్కడి ప్రజలు గ్రహాంతర కలుపు అని పిలుస్తుంటారు.

మన రాష్ట్రంలో దీనిని కంపెచెట్టు అంటారు. ఇది మేకల మేత కోసం మాత్రమే పనికి వస్తుంది. ఇది పొలాలను నాశనం చేస్తుందని చేనుల వద్ద దీనిని నరికేస్తారు. అయితే దీనిపై ఇటీవల చేపట్టిన అధ్యయనంలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ మొక్కల పెంపంకంతో లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపింది. ఈ మొక్కలను పలు పదార్థాలను తయారు చేయడంలో వాడవచ్చని పరిశోధకులు తెలిపారు. బిస్కెట్, బ్రెడ్, కాఫీ, బ్రాందీ, సిరప్ వంటి వాటి తయారీలో దీనిని యూజ్ చేయొచ్చని గుర్తించారు. కానీ దీని ఉత్పత్తులు భారత్‌లో ఎక్కువగా ప్రాచుర్యంలో లేవని తెలిపారు. దీనిపై అవగాహన కల్పించడం అవసరమని చెబుతున్నారు పరిశోధకులు.

అయితే సదురు పరిశోధన ప్రకారం.. ఈ మొక్కలతో కొత్త పరిశ్రమలు సృష్టించి ఉపాధిక కల్పించే చాన్స్ ఉంది. ఇది చాలా తక్కువ ఇన్వెస్ట్ మెంట్ తో కూడుకున్నదట. కానీ వేరే దేశాల్లోని రిజల్ట్ చూసిన తర్వాత ఇది ఆచరణలో సాధ్యం కాదని చెబుతున్నారు. ఇందుకు స్పెషల్ గా మేనేజ్ మెంట్ పాలసీని రూపొందించుకోవాలని చెప్పుకొచ్చారు పరిశోధకుల్లో ఒక వ్యక్తి.

కొన్ని ఏండ్లుగా దీనిని ఇంటి అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు ఇక్కడి వారు. ఎందుకంటే దీనిని కాల్చినప్పుడు పొగ ఎక్కువగా రాదు కాబట్టి. ఇందులో కెలోరిఫిక్ సైతం ఎక్కువ ఉంటుంది. దీని ద్వారా ఉత్పత్తి అయ్యే బయోమస్ ను విద్యుత్ తయారీలో యూజ్ చేస్తారు. విద్యుత్ ఉత్పత్తిలో ఈ మొక్క ద్వారా తయారయ్యే బయోమస్ అతి తక్కువ ఖర్చు మాత్రమే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

Also Read : Ayurveda Mulikalu : ఈ ఆయుర్వేద మూలికలు వాడండి.. గుండె ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడతాయి!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Leave a Comment