Ayurveda Mulikalu : మన బాడీలో గుండె మెయిన్ పార్ట్. ఇది కొట్టుకోవడం ఆగిపోయే ప్రాణం పోతుంది. కానీ చాలా మంది దీని ఆరోగ్యం గురించి ఎక్కువగా పట్టించుకోరు. మరి కొందరు మాత్రం తమ గుండెను హెల్తీగా ఉంచేందుకు వ్యాయామం, ధ్యానం వంటివి చేస్తుంటారు. మంచి ఆహారం సైతం గుండె ఆరోగ్యానికి హెల్ప్ అవుతుంది. మరి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏయే పదార్థాలు ఎంత మోతాదులో తీసుకోవాలో ఓ సారి తెలుసుకుందాం.
అర్జన బెరడు గుండెను హెల్తీగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఇది హార్ట్ కు ఓ టానిక్ లాగా పనిచేస్తూ.. దాని మజిల్స్ ను బలంగా మారుస్తుంది. బీపీ స్థాయిని సైతం తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఈ బెరడును హార్నింగ్, ఈవెనింగ్ సగం టీస్పూన్ పరిమాణంలో హనీతో కలిపి తీసుకుంటే మంచింది. ఉసిరి సైతం గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదంలో కాలేయం, హార్డ్ డిసీజ్, షుగర్, గ్యాస్ట్రిక్, అల్సర్ వంటి అనేక వ్యాధుల నివారణలో ఉసిరిక పొడిని యూజ్ చేస్తారు. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆయుర్వేద మూలికల పౌడర్ నిత్యం స్వచ్ఛమైన తేనెతో తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
మునగాకు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉంటుంది. ఈ ఆకులు, పువ్వులు, కాయల్లో అనేక ఔషధగుణాలు ఉండటం వల్ల అవి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. ఈ ఆకుల జూస్ ను ప్రతి రోజూ పరగడుపున 30 మిల్లీ లీటర్ల పరిమాణంలో తీసుకోవాలి. అవిసె గింజలు సైతం హార్ట్ డిసీజ్‌లు ఉన్న వారికి ఉపయోగపడతాయి. బీపీని కంట్రోల్ చేయడంలో ఇది సహాయపడుతుంది. పసుపు సైతం గుండెకు మంచి చేస్తుంది. దీనిని రెగ్యులర్ గా వంటకాల్లో వాడుతూనే ఉంటాం. కిచన్‌కు పసుపు ఫేమస్. ఇందులో రోగనిరోధక లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే గుండెకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే డాకర్లను సంప్రదించడం ఉత్తమం.
Read Also : Diabetics Insulin : ‘డయాబెటీస్’ రోగులు టైంకు ఇన్సులిన్ తీసుకోకపోతే ఏమవుతుంది.. ముప్పు తప్పదా..?