Fenugreek Benefits : ప్రతిరోజు ఆకుకూరలను ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఢోకా ఉండదు. మనకు నిత్యం పలు రకాల ఆకుకూరలు లభిస్తుంటాయి. వాటిలో మెంతికూర ఒకటి. మెంతికూరను తరుచు ఆహారంలో తీసుకుంటే అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఆకుతో పాటు మెంతి గింజలు కూడా వినియోగించుకోవచ్చు. ప్రధానంగా మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు తగ్గించడంలో మెంతికూర కీలక పాత్ర పోషిస్తుంది. కాల్షియం, మాంగనీస్, మినరల్స్, సెలీనియం, ఐరన్, జింక్ లాంటి పోషకాలు కలిగి ఉంటాయి.
టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నవారు పచ్చి మెంతి ఆకులు తింటే చక్కర స్థాయి నియంత్రణలో ఉంటుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిచడంలో మెంతికూర సహాయపడుతుంది. దీంతో గుండె సమస్యల ముప్పును నివారిస్తుంది. మెంతి ఆకుల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తూ.. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.

అధిక రక్తపోటుతో బాధపడేవారు మెంతి ఆకులు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఇందులో ఉంటే గెలాక్టోమన్నన్, పొటాషియం కారణంగా రక్త ప్రసరణ నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. అలాగే బరువు తగ్గడానికి, కడుపులో అల్సర్, పేగు మంట సమస్యను నివారించడంలో మెంతికూర ఉపయోగపడుతుంది.
దగ్గు, బ్రోన్కైటిస్ ఎగ్జిమా వంటి వ్యాధులతో బాధపడేవారు మెంతికూర తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అలాగే శరీరంలో ఎసిడీటీ స్థాయిని తగ్గిస్తుంది. పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. తరుచు మెంతికూర తింటే పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే బాలింతల్లో తల్లిపాలు పెరగడానికి మెంతికూర సహాయపడుతుంది. రోజు ఒక స్పూన్ మెంతి ఆకుల రసాన్ని పిల్లలకు తాగిస్తే.. నులిపురుగులు తగ్గుతాయి.
Read Also : Eating Gaggery : బెల్లం.. మోతాదుకు మించితే అసలుకే ఎసరు..!